నరరూప రాక్షసుడు చంద్రబాబు.. ఆర్జీవి మాటల దాడి!

విధాత‌: రోడ్లు, ప్రజలు నడయాడే రద్దీ ప్రాంతాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలకు అనుమతులు ఇచ్చేది లేదంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అనూహ్యంగా మద్దతు పలికారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు ప్రకటనలు చేస్తుండగా ఇప్పుడు వాటిని ఆర్జీవి తిప్పికొడుతున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడిని ఒక నరరూప రాక్షసుడు అంటూ వర్మ తీవ్రంగా స్పందించాడు. చంద్రబాబు నాయుడి సభల సందర్భంగా జనాలు చనిపోవడం పై వర్మ ఒక ప్రత్యేక వీడియోను […]

  • By: krs    latest    Jan 05, 2023 12:17 PM IST
నరరూప రాక్షసుడు చంద్రబాబు.. ఆర్జీవి మాటల దాడి!

విధాత‌: రోడ్లు, ప్రజలు నడయాడే రద్దీ ప్రాంతాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలకు అనుమతులు ఇచ్చేది లేదంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అనూహ్యంగా మద్దతు పలికారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు ప్రకటనలు చేస్తుండగా ఇప్పుడు వాటిని ఆర్జీవి తిప్పికొడుతున్నారు.

ఈ మేరకు చంద్రబాబు నాయుడిని ఒక నరరూప రాక్షసుడు అంటూ వర్మ తీవ్రంగా స్పందించాడు. చంద్రబాబు నాయుడి సభల సందర్భంగా జనాలు చనిపోవడం పై వర్మ ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో.. కుక్కలకు బిస్కెట్లు వేసినట్లుగా జనాలకు చంద్రన్న కానుక పేరుతో బిస్కట్లు వేసి సభకు రప్పించుకున్నారు. చిన్న ఇరుకు సందుల్లో జనాలు తక్కువగా ఉన్నా కూడా ఎక్కువగా కనిపిస్తారు అనే ఉద్దేశ్యంతో అక్కడ కార్యక్రమం నిర్వహించారు.

ఒకటి రెండు చంద్రన్న కానుకలు ఇచ్చి ఫొటోలు దిగి అక్కడ నుండి వెళ్లి పోయిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జరిగిన సంఘటన గురించి పట్టించుకోలేదు అంటూ వర్మ ఆరోపించాడు. కేవలం వ్యక్తిగత ప్రతిష్ట కోసమే చంద్రబాబు నాయుడు ఇలా చేస్తున్నాడని.. తన పబ్లిసిటీ కోసం ఎంత మంది చనిపోతే అంత మంచిది అన్నట్లుగా ఆయన భావిస్తున్నాడంటూ వర్మ పేర్కొన్నాడు.

సభలకు వస్తే మందు ఇస్తాం అంటూ మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడే. జనాలు ఎంత మంది చనిపోతే అంత పాపులారిటీ పెరుగుతుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నాడు. అందుకే ఇలా వ్యవహరిస్తున్నాడు. ఇరుకు సందుల్లో సభ పెడితే ఏం జరుగుతుందో 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్న నీకు తెలియదా చంద్రబాబు అంటూ వర్మ ప్రశ్నించాడు. ఇప్పటి వరకు సీఎంగా పలు పదవులు నిర్వహించారు అనే ఉద్దేశ్యంతో మీరు అంటూ సంభోదించాను.

కానీ ఇక నుండి నువ్వు అనే మాట్లాడుతాను అని కూడా వర్మ పేర్కొన్నాడు. దీంతో వైస్సార్సీపీకి బయట నుంచి మద్దతు దక్కినట్లు అయింది. ఇప్పటికే మంత్రులు అమర్నాథ్, ఇతర ఎమ్మెల్యేలు ఈ విషయంలో చంద్రబాబును టార్గెట్ చేస్తుండగా ఇప్పుడు వారికి ఆర్జీవి తోడయ్యారు.