Rishabh Pant | రిషబ్ పంత్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్.. ప్రపంచ కప్‌లో ఆడతాడా లేదా..!
Rishabh pant: తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి వెళుతున్న సమయంలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం తర్వాత పంత్ కాలికి శస్త్ర చికిత్స జరగగా, ఆ తర్వాత మూడు నెలలు మంచానికే పరిమితం అయ్యాడు. కొన్ని నెలల పాటు చేతికర్ర సాయంతో నడిచాడు. ఇక ఇప్పుడు ఎవరి సాయం లేకుండా నడుస్తున్నాడు. అంతేకాదు వీలైనంత త్వరగా టీమిండియాలోకి వచ్చేందుకు […]

Rishabh pant: తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి వెళుతున్న సమయంలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం తర్వాత పంత్ కాలికి శస్త్ర చికిత్స జరగగా, ఆ తర్వాత మూడు నెలలు మంచానికే పరిమితం అయ్యాడు. కొన్ని నెలల పాటు చేతికర్ర సాయంతో నడిచాడు.
ఇక ఇప్పుడు ఎవరి సాయం లేకుండా నడుస్తున్నాడు. అంతేకాదు వీలైనంత త్వరగా టీమిండియాలోకి వచ్చేందుకు చాలా కష్టపడుతున్నాడు. పంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అతడికి అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే.
పంత్ కి ఎలాంటి సహాయ సహకారాలు కావలన్నా కూడా అవి అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది బీసీసీఐ. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంత్ ఆడకపోయినప్పటికీ, అతడి ఏడాది వేతనం రూ.16 కోట్లు చెల్లించింది.ప్రస్తుతం పంత్ కోలుకునే ప్రక్రియలో కీలక అడుగులు వేస్తున్నాడు. తన హెల్త్ కి సంబంధిం చిన విషయాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ అభిమానులని ఆనందిపంజేస్తున్నాడు.
Not bad yaar Rishabh ❤️❤️