వరంగల్: పోలీస్ నియామకాల్లో అపశృతి.. అస్వస్థతకు గురైన అభ్యర్థి..!
ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స సీపీ రంగనాథ్ పరామర్శ విధాత, వరంగల్: పోలీస్ నియామకాల్లో భాగంగా హన్మకొండలోని కేయూ మైదానంలో నిర్వహిస్తున్న దేహ దారుఢ్య పరీక్షల్లో శనివారం అపశృతి జరిగింది. అభ్యర్థి బానోతు రాజేందర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే రాజేందర్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అభ్యర్థికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పరీక్షల్లో భాగంగా నిర్వహించిన 1600 మీటర్ల పరుగు అనంతరం అస్వస్థత గురైన అభ్యర్థిని పోలీస్ అధికారులు ఎంజీఎంకు తరలించారు. […]

- ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స
- సీపీ రంగనాథ్ పరామర్శ
విధాత, వరంగల్: పోలీస్ నియామకాల్లో భాగంగా హన్మకొండలోని కేయూ మైదానంలో నిర్వహిస్తున్న దేహ దారుఢ్య పరీక్షల్లో శనివారం అపశృతి జరిగింది. అభ్యర్థి బానోతు రాజేందర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే రాజేందర్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అభ్యర్థికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పరీక్షల్లో భాగంగా నిర్వహించిన 1600 మీటర్ల పరుగు అనంతరం అస్వస్థత గురైన అభ్యర్థిని పోలీస్ అధికారులు ఎంజీఎంకు తరలించారు. అభ్యర్థికి ఎంజీఎం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అభ్యర్థి అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ వెంటనే ఎంజీఎం చేరుకొన్నారు.
అస్వస్థతకు గురైన అభ్యర్థికి అందిస్తున్న చికిత్సను తెలుసుకోవడంతోపాటు అభ్యర్థి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అస్వస్థతకు గురైన అభ్యర్థికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా పోలీస్ కమిషనర్ వైద్యులకు సూచించారు.