గోషామహల్‌లో కుంగిన రోడ్డు.. వాహనాలు, కూరగాయల బండ్లు ధ్వంసం
విధాత: హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాక్నవాడిలో ఘోర ప్రమాదం జరిగింది. చాక్నవాడి ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో అక్కడున్న టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ గుంతలో కూరుకుపోయి ధ్వంసం అయ్యాయి. అదే రోడ్డుపై ఇవాళ వారాంతపు సంత నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కూరగాయల బండ్లు కూడా ధ్వంసమయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు చాక్నవాడి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆ మార్గం గుండా రాకపోకలను పోలీసులు బంద్ చేశారు. పోలీసులు […]

విధాత: హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాక్నవాడిలో ఘోర ప్రమాదం జరిగింది. చాక్నవాడి ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో అక్కడున్న టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ గుంతలో కూరుకుపోయి ధ్వంసం అయ్యాయి.
అదే రోడ్డుపై ఇవాళ వారాంతపు సంత నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కూరగాయల బండ్లు కూడా ధ్వంసమయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు చాక్నవాడి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆ మార్గం గుండా రాకపోకలను పోలీసులు బంద్ చేశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.