IND vs WI: తొలి మ్యాచ్‌లోనే దంచి కొట్టిన య‌శ‌స్వి.. భారీ స్కోర్ దిశగా దూసుకుపోతున్న టీమిండియా

IND vs WI: భార‌త్- వెస్టిండీస్ మ్యాచ్ రంజుగా సాగుతుంది. తొలి టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 150 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఇక బ‌దులుగా బ్యాటింగ్ మొద‌లు పెట్టిన టీమిండియాలో కుర్రాడు యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించిన జైస్వాల్ నాటౌట్‌గా నిలిచాడు. ఓవర్‌నైట్ స్కోరు 80/0తో ఇన్నింగ్స్ ఆరంభించిన య‌శ‌స్వి, రోహిత్ మంచి భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు.ఈ క్ర‌మంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ 103 పరుగులతో […]

  • By: sn    latest    Jul 13, 2023 11:22 PM IST
IND vs WI: తొలి మ్యాచ్‌లోనే దంచి కొట్టిన య‌శ‌స్వి.. భారీ స్కోర్ దిశగా దూసుకుపోతున్న టీమిండియా

IND vs WI: భార‌త్- వెస్టిండీస్ మ్యాచ్ రంజుగా సాగుతుంది. తొలి టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 150 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఇక బ‌దులుగా బ్యాటింగ్ మొద‌లు పెట్టిన టీమిండియాలో కుర్రాడు యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జట్టుకు అదిరిపోయే ఆరంభం అందించిన జైస్వాల్ నాటౌట్‌గా నిలిచాడు. ఓవర్‌నైట్ స్కోరు 80/0తో ఇన్నింగ్స్ ఆరంభించిన య‌శ‌స్వి, రోహిత్ మంచి భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు.ఈ క్ర‌మంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ 103 పరుగులతో ఆకట్టుకోగా, సెంచరీ పూర్తవగానే అతను పెవిలియన్ చేరాడు. హిట్‌మ్యాన్ అవుటైన వెంటనే శుభ్‌మన్ గిల్ (6) కూడా త్వ‌ర‌గానే ఔటై పెవిలీయ‌న్‌కి చేరాడు.

రోహిత్, గిల్ వెంట‌వెంట‌నే ఔట్ కావ‌డంతో మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు య‌శ‌స్వి( 143 నాటౌట్‌),విరాట్ కోహ్లీ (36 నాటౌట్). ఇక‌ తనదైన స్టైల్‌లో జైస్వాల్ రెచ్చిపోయి ఆడి అరంగేట్రంలోనే సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు యశస్వి జైస్వాల్.. అయితే రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు కేవలం 2 వికెట్ల కోల్పోయి 312 పరుగులు చేసింది. చూస్తుంటే తొలి ఇన్నింగ్స్‌లోనే భారత జట్టు భారీ స్కోరు చేసి విండీస్ ముందు ఊహించనంత పెద్ద లక్ష్యాన్ని ఉంచే అవకాశం ఎక్కువ‌గా ఉంది. వీలైనంత స‌మ‌యం య‌శ‌స్వి క్రీజులో కేటాయిస్తే భార‌త్ భారీ స్కోర్ సాధించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

ఇక రెండో రోజు ఆట ఫస్ట్ సెషన్‌లో అల్జారీ జోసెఫ్ వేసిన 36 ఓవర్‌లో ఓ భారీ సిక్సర్‌తో పాటు బౌండరీ బాదిన రోహిత్ శర్మ.. రకీమ్ కార్న్‌వాల్ వేసిన మరుసటి ఓవర్ తొలి బంతికి త్వ‌ర‌గా సింగిల్ తీసి 106 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేశాడు. ఇది రోహిత్‌కి అంతర్జాతీయ క్రికెట్‌లో 102వ హాఫ్ సెంచరీ. జాబితాలో సచిన్ టెండూల్కర్ 120 అర్థశతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 102 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ద‌క్కించుకున్నాడు. ఇక సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ 101 హాఫ్ సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో 3500 పరుగుల మైలు రాయిని అందుకోవ‌డం విశేషం.