‘అంత భయమెందుకు’: రోజాకు.. బ్రహ్మాజీ కౌంటర్!
విధాత: రాజకీయ నాయకుడిగా మొదట్లో జనసేనను స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్‌ను చాలా మంది చాలా లైట్‌గా తీసుకున్నారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఏమాత్రం ప్రభావం చూపించలేక ఎన్నికల్లో బోల్తాపడ్డాడని, చివరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి దానికి ప్రతిఫలంగా రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర పర్యాటక మంత్రిగా పదవిని చేజిక్కించుకున్నాడని మాట్లాడారు. చిరంజీవి లేనిదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేడు. మరి చిరంజీవికే సాధ్యం కానిది పవన్‌కు సాధ్యమా అంటూ సెటైర్లు […]

విధాత: రాజకీయ నాయకుడిగా మొదట్లో జనసేనను స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్‌ను చాలా మంది చాలా లైట్‌గా తీసుకున్నారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఏమాత్రం ప్రభావం చూపించలేక ఎన్నికల్లో బోల్తాపడ్డాడని, చివరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి దానికి ప్రతిఫలంగా రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర పర్యాటక మంత్రిగా పదవిని చేజిక్కించుకున్నాడని మాట్లాడారు.
చిరంజీవి లేనిదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేడు. మరి చిరంజీవికే సాధ్యం కానిది పవన్‌కు సాధ్యమా అంటూ సెటైర్లు వేశారు. కానీ 2019లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఉన్న బలం కంటే ఇప్పుడు ఆయనకు పది రెట్ల బలం వచ్చి చేరింది. రోజురోజుకు అయన రాజకీయంగా బల పడుతున్నాడు. దాంతో ఇప్పుడు అందరూ వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు కంటే పవన్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.
ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడో లేదో తెలియదు గాని ఆయన కింగ్ మేకర్‌గా అవతరించడం మాత్రం ఖాయం అనే మాట వినిపిస్తోంది. జనసేన పార్టీకి జనాల్లో వస్తున్న ఆదరణ చూసి ఇప్పుడు సినీ సెలబ్రిటీలు కూడా పవన్ కి సపోర్ట్ చేస్తూ ఆయన వెన్నంటి నిలబడటానికి ముందుకొస్తున్నారు.
కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వి గతంలో వైసీపీలో ఉండి పవన్ పై ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశాడు. ఎస్‌విబిసి ఛానల్‌లో ఒక కీలక పదవిని సాధించాడు. కానీ ఆయన కథ చాలా తొందరగానే ముగిసింది. ఇటు సినిమాలలో అవకాశాలు లేక అటు రాజకీయంగా జగన్ వాడుకొని వదిలేయడంతో ఆయన దిక్కుతోచని పరిస్థితుల్లో పడి చివరకు పవన్‌కు మద్దతు ఇచ్చాడు. ఇక తదుపరి వంతు పోసాని కృష్ణమురళీది అని కొందరు జోస్యం చెబుతున్నారు.
ఇక ఇటీవల జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా పవన్ జనసేనకు బహిరంగంగా మద్దతు తెలిపాడు. అంతేకాదు జనసేన యువశక్తి సభకు వచ్చి పవన్‌కి సపోర్టుగా వైసీపీ పార్టీని ఏకిపారేశాడు. ఆది చేసిన కామెంట్స్ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. దీనిపై మంత్రి రోజా కూడా స్పందించింది.
ఆమె మాట్లాడుతూ హైపర్ ఆది లాంటి వాళ్ళ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకుంటూ అడపా దడపా సినిమాల్లో నటిస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా నెగటివ్‌గా మాట్లాడితే సినిమాల్లో ఎక్కడ అవకాశాలు రావో అని భయపడతారు. అది కేవలం భయంతో చేసిన మద్దతే కానీ.. ప్రేమతో చేసిన మద్దతు కాదు… అని విమర్శించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా దీనిపై సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనదైన స్టైల్ లో రోజా కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ నన్ను ఎప్పుడు మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని గాని పార్టీలో చేరమని గాని అడగలేదు. చిన్న ఆర్టిస్ట్‌లే కదా.. ఎందుకు అంతగా భయపడతారు? అంటూ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది.
ఒకప్పుడు అధికార పార్టీపై గొంతు ఎత్తి మాట్లాడడానికి భయపడిన సినిమా ఆర్టిస్టులు ఇప్పుడు వరుసగా వైసీపీ పార్టీపై విరుచుకు పడుతున్నారు. ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ సపోర్టు ఈసారి పవన్ కళ్యాణ్‌కు ఖచ్చితంగా ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు
నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ campain చెయ్యమని కానీ పార్టీ లో చేరమని కానీ అడగలేదు .
చిన్న ఆర్టిస్ట్ లే కదా .. అంత బయపడతారెందుకు .. https://t.co/9W0gU2uF98— Brahmaji (@actorbrahmaji) January 19, 2023