బోరు బావిలో గులాబీ నీరు

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీలో వింత చోటుచేసుకుంది. కాలనీకి చెందిన కట్ట శ్రీనివాసాచారి ఇంటి బోరుబావి నుంచి గులాబీ రంగు నీరు వస్తోంది

  • By: Somu    latest    Dec 12, 2023 12:25 PM IST
బోరు బావిలో గులాబీ నీరు
  • ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజానీకం
  • భూ పొరల్లో రసాయనిక సమ్మేళనమంటూ చర్చ


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీలో వింత చోటుచేసుకుంది. కాలనీకి చెందిన కట్ట శ్రీనివాసాచారి ఇంటి బోరుబావి నుంచి గులాబీ రంగు నీరు వస్తోంది. దీంతో యజమాని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. నిరవధికంగా గులాబీ రంగులో బోరునీరు రావడంతో విస్తుపోయాడు. కట్ట శ్రీనివాసాచారికి అనుమానం వచ్చి, సమీప బోరుబావులను పరిశీలిస్తే, అక్కడ మామూలు నీళ్లే వస్తున్నాయి.


విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు వింతగా వస్తున్న గులాబీ రంగు నీటిని చూడడానికి ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఆ నీటిని ఉపయోగించడం లేదని శ్రీనివాస్ పేర్కొన్నారు. భూ పొరల్లో రసాయనిక సమ్మేళనంతో ఇలా జరిగి ఉండవచ్చునని స్థానికులు చర్చించుకుంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశీలించాలని బాధితుడు కోరారు.