Russia Scientist Miracle : 46వేల ఏళ్ల నాటి పురుగును బతికించారు
Russia Scientist Miracle సైబీరియా: మంచుగడ్డల కింద 46 వేల ఏళ్లుగా ఘనీభవించిపోయి ఉన్న ఉన్న ఒక పురుగును శాస్త్రవేత్తలు తిరిగి బతికించారు. పీఎల్వోఎస్ జెనెటిక్స్ జనరల్ అనే ప్రముఖ సైన్స్ పత్రిక ఈ విషయాన్ని తెలిజేసింది. వివిధ దేశాల శాస్త్రవేత్తలతో కూడిన బృందం రష్యాలోని సైబీరియా మంచు ప్రాంతాన్ని సందర్శించింది. ఆ సమయంలో గడ్డ కట్టిన మంచు పొరల క్రింద కప్పబడి వున్న సూక్ష్మ జీవి శిలాజాన్ని కనుగొన్నారు. దానిపై జరిపిన వివిధ పరిశోధనల పర్యంతరం […]

Russia Scientist Miracle
సైబీరియా: మంచుగడ్డల కింద 46 వేల ఏళ్లుగా ఘనీభవించిపోయి ఉన్న ఉన్న ఒక పురుగును శాస్త్రవేత్తలు తిరిగి బతికించారు. పీఎల్వోఎస్ జెనెటిక్స్ జనరల్ అనే ప్రముఖ సైన్స్ పత్రిక ఈ విషయాన్ని తెలిజేసింది. వివిధ దేశాల శాస్త్రవేత్తలతో కూడిన బృందం రష్యాలోని సైబీరియా మంచు ప్రాంతాన్ని సందర్శించింది. ఆ సమయంలో గడ్డ కట్టిన మంచు పొరల క్రింద కప్పబడి వున్న సూక్ష్మ జీవి శిలాజాన్ని కనుగొన్నారు.
దానిపై జరిపిన వివిధ పరిశోధనల పర్యంతరం అది ఒక రౌండ్ వార్మ్ (ఎర లాంటి పురుగు) అని తేల్చారు. ఈ పురుగుపై జరిపిన కార్బన్ డేటింగ్ ప్రయోగం వలన ఇది సుమారు 46,000 సంత్సరాల క్రితం నాటిదని తేల్చారు.
అయితే అది ఒక సుదీర్ఘ నిద్రావస్థ గుండా ప్రయాణిస్తున్నదని వారన్నారు. అది జీవించే వుందని తెలిపారు. ఈ దశలో వున్న ఆ పరిస్థితిని క్రిప్టోబయోసిస్ అంటారు అని వారు చెప్పారు. ఈ దశనుండి దానిని బతికించవచ్చునని కూడా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఈ పురుగును నీటితో తడపటం ద్వారా దానిలో తిరిగి జీవం వస్తుందని చెప్పారు. ఈ పురుగు జీవించిన తరువాత తన ప్రత్యుత్పత్తి ద్వారా సంతానోత్పత్తి ని కొనసాగిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
ఇటువంటి సంతానోత్పత్తికి ఇటువంటిదే మరొక పురుగుతో జత కట్టవలసిన పని లేదని వారు అన్నారు. ఈ విధమైన సంతానోత్పత్తిని పార్థినేజీనోసిస్ అంటారని వివరించారు. ఈ పురుగుకు సంబందించిన ఈ నమూనా పూర్తిగా కొత్తదని శాస్త్ర వేత్తలుతెలియజేశారు.