రష్యా ఎంపీ.. ఒడిషాలో అనుమానాస్పద మృతి..!

ఒడిషా హోటల్‌ గదిలో రష్యన్ల మృతిపై అనేక అనుమానాలు.. రెండ్రోజుల తేడాతో ఇద్ద‌రు మృతి.. విధాత: రష్యాకు చెందిన ఎంపీ ఒడిషాలోని ఓ హోటల్‌లో అనుమానస్పదంగా చనిపోయిన ఘటన సంచలనాత్మకం అవుతున్నది. ఒకరు కాదు.., ఇద్దరు రష్యన్లు హోటల్‌ గదిలోనే చనిపోవటం చర్చనీయాంశం అవుతున్నది. యాత్రికులుగా రష్యా నుంచి వచ్చి ఇక్కడ ఆత్మహత్యకు ఎందుకు పాల్పడుతున్నారనేది అంతుపట్టని విషయంగా మారింది. రష్యా నుంచి డిసెంబర్‌ 21న పావెల్ ఆంటోవ్‌, వ్లాదిమిర్‌ బైదెనోవ్‌ అనే ఇద్దరు విదేశీ పర్యాటకులుగా […]

రష్యా ఎంపీ.. ఒడిషాలో అనుమానాస్పద మృతి..!
  • ఒడిషా హోటల్‌ గదిలో రష్యన్ల మృతిపై అనేక అనుమానాలు..
  • రెండ్రోజుల తేడాతో ఇద్ద‌రు మృతి..

విధాత: రష్యాకు చెందిన ఎంపీ ఒడిషాలోని ఓ హోటల్‌లో అనుమానస్పదంగా చనిపోయిన ఘటన సంచలనాత్మకం అవుతున్నది. ఒకరు కాదు.., ఇద్దరు రష్యన్లు హోటల్‌ గదిలోనే చనిపోవటం చర్చనీయాంశం అవుతున్నది. యాత్రికులుగా రష్యా నుంచి వచ్చి ఇక్కడ ఆత్మహత్యకు ఎందుకు పాల్పడుతున్నారనేది అంతుపట్టని విషయంగా మారింది.

రష్యా నుంచి డిసెంబర్‌ 21న పావెల్ ఆంటోవ్‌, వ్లాదిమిర్‌ బైదెనోవ్‌ అనే ఇద్దరు విదేశీ పర్యాటకులుగా ఒడిషాకు చేరుకున్నారు. వారిద్దరూ ఓ హోటల్‌లో గది అద్దెకు తీసుకొని ఉన్నారు. ఉన్నట్లుండి ఈ నెల 22న బైదెనోవ్‌ హోటల్‌ గదిలో అనుమానస్ప దంగా మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యుల అనుమతితో ఆయన అంత్యక్రియలు స్థానిక అధికారులు జరిపారు. ఈ తతంగాన్నంతా ఆంటోవ్‌ దగ్గరుండి నిర్వహించాడు.

డిసెంబర్‌ 24న ఉన్నట్లుండి పావెల్‌ ఆంటోవ్‌ కూడా అనుమాన పరిస్థితుల్లోనే చనిపోయాడు. రష్యా పార్లమెంట్‌ సభ్యుడు పావెల్‌ ఆంటోవ్‌ అత్యంత ధనవంతుడు. పార్లమెంటులో రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ను అడుగడుగునా విమర్శిస్తుంటాడు.

ఇటీవలి ఉక్రెయిన్‌ యుద్ధాన్ని కూడా ఆంటోవ్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ నేపథ్యంలోంచే అతని మరణం సంభవించిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

పుతిన్‌పై ఒక ఆరోపణ ఉన్నది. పుతిన్‌ను వ్యతిరేకించిన వారు, ఎక్కడ ఉన్నా ఎవ‌రికీ అంతపుట్టని స్థితిలో హతమవుతారన్న ప్రచారం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆంటోవ్‌ది కూడా అనుమానాస్పదమే అన్న వాదన కూడా ఉన్నది.

మరో ముఖ్య విషయం ఏమంటే.. ఇదే హోటల్‌లో మరో ఇద్దరు రష్యన్లు కూడా ఉన్నారు. వీరికి ఆంటోవ్‌, బైదెనోవ్‌లకు ఏమైనా సంబంధం ఉన్నదా, వీరంతా కలిసే విదేశీ యాత్రకు వచ్చారా.. అన్నది తేలాల్సి ఉన్నది.

వీరికి సంబంధించిన పూర్తి వివరాలేవీ అందుబాటులో లేవు. రష్యా రాయబార కార్యాలయం నుంచి పూర్తి సమాచారం అందిన తర్వాత వారిని వెనక్కి పంపటం, తదితర విషయాలపై పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉన్నదని అధికారులు అంటున్నారు.