నేటి నుంచి రైతు బంధు.. తొలుత ఎకరం రైతుకే!

70.54 లక్షల రైతుల ఖాతాలో జమ కానున్న రూ.65,559.28 కోట్ల నగదు యాసంగి పంటకు ఎకరానికి రూ. రూ.5 వేల చొప్పున జమ విధాత: యాసంగి పంటకు రైతు బంధు కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున బుధవారం నుంచి రైతుల ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన 70.54 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇవ్వనున్నారు. యాసంగి పంట కింద 1,53, 53 వేల ఎకరాలకు మొత్తం పదో […]

  • By: krs    latest    Dec 28, 2022 10:31 AM IST
నేటి నుంచి రైతు బంధు.. తొలుత ఎకరం రైతుకే!
  • 70.54 లక్షల రైతుల ఖాతాలో జమ కానున్న రూ.65,559.28 కోట్ల నగదు
  • యాసంగి పంటకు ఎకరానికి రూ. రూ.5 వేల చొప్పున జమ

విధాత: యాసంగి పంటకు రైతు బంధు కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున బుధవారం నుంచి రైతుల ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన 70.54 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇవ్వనున్నారు.

యాసంగి పంట కింద 1,53, 53 వేల ఎకరాలకు మొత్తం పదో విడతతో రూ.65,559.28 కోట్లు రైతుల ఖాతాలోకి జమ చేయనున్నారు. అయితే గత వానాకాలం 65 లక్షల మంది అర్హులైన రైతులకు రూ.7434.67 కోట్లు రైతుబంధు నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

అన్నదాత శాసించే స్థానంలో ఉండాలన్నది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష: మంత్రి నిరంజన్‌రెడ్డి

దేశానికి అన్నం పెట్టే అన్నదాత యాచించే స్థితిలో కాదు శాసించే స్థానంలో ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశమంతటా తెలంగాణ పథకాలు అమలు చేయాలని రైతులు నినదిస్తున్నారన్నారు.

దేశాన్ని పాలిస్తున్న పాలకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని మంత్రి అన్నారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన నరేంద్రమోడీ ఎనిమిదన్నరేళ్లయినా ఒక స్పష్టమయిన వ్యవసాయ విధానాన్ని రూపొందించ లేకపోయారన్నారు.

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ఉపాధి హామీకి వ్యవసాయం అనుసంధానం, 60 ఏళ్లు నిండిన రైతులకు ఫించను, పంటలకు మద్దతు ధరల విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు వంటి హామీల విషయంలో దేశ రైతాంగాన్ని దారుణంగా మోసంచేశారని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.