సాగర్ ఆయకట్టుకు నిరంతరం నీరు అందించాలి: భారీ ప్రదర్శనతో కాంగ్రెస్ వినతి
విధాత: సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు వారాబంది పద్ధతిన కాకుండా నిరంతరాయంగా సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయకట్టు రైతులు ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ ఆఫీస్ రాజీవ్ భవన్ నుండి మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రైతులు భారీ నిరసన ప్రదర్శనతో నీటిపారుదలశాఖ ఎన్ఎస్పి డివిజన్ కార్యాలయానికి వచ్చి సూపరీంటెండెంట్ ఐ.వెంకటయ్యకు వినతి […]

విధాత: సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు వారాబంది పద్ధతిన కాకుండా నిరంతరాయంగా సాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయకట్టు రైతులు ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ ఆఫీస్ రాజీవ్ భవన్ నుండి మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రైతులు భారీ నిరసన ప్రదర్శనతో నీటిపారుదలశాఖ ఎన్ఎస్పి డివిజన్ కార్యాలయానికి వచ్చి సూపరీంటెండెంట్ ఐ.వెంకటయ్యకు వినతి పత్రం అందజేశారు.
ప్రస్తుతం యాసంగి వరి పొలాలు పొట్ట దశలో ఉన్నందున వారబందీ పద్దతిలో సరిగా పొలాలు పారక పంటలు ఎండిపోతున్నాయని అధికారులకు వివరించారు. వారబందీని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.