సాయిపల్లవి.. శేఖర్‌ కమ్ములతో వన్స్‌మోర్‌?

విధాత‌: హీరోయిన్ సాయిపల్లవి చిత్ర పరిశ్రమలో ఎంతో టాలెంట్ ఉన్న నటి. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టే సహజమైన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ‘విరాటపర్వం’ తర్వాత మరో చిత్రం చేయలేదు. విరాటపర్వంపై ఎన్నో నమ్మకాలు పెట్టుకుంది కానీ.. ఆ చిత్రం సరిగా ఆడకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుంది. దాంతో ఆమె సినిమాలు మానేస్తుందని, తన డాక్టరు వృత్తిలో స్థిరపడుతుందని.. అందుకోసం ఒక హాస్పిటల్‌ను ప్రారంభించబోతుందనేలా ఎన్నో వార్తలు […]

సాయిపల్లవి.. శేఖర్‌ కమ్ములతో వన్స్‌మోర్‌?

విధాత‌: హీరోయిన్ సాయిపల్లవి చిత్ర పరిశ్రమలో ఎంతో టాలెంట్ ఉన్న నటి. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టే సహజమైన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ‘విరాటపర్వం’ తర్వాత మరో చిత్రం చేయలేదు.

విరాటపర్వంపై ఎన్నో నమ్మకాలు పెట్టుకుంది కానీ.. ఆ చిత్రం సరిగా ఆడకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకుంది. దాంతో ఆమె సినిమాలు మానేస్తుందని, తన డాక్టరు వృత్తిలో స్థిరపడుతుందని.. అందుకోసం ఒక హాస్పిటల్‌ను ప్రారంభించబోతుందనేలా ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వెబ్ సిరీస్‌కు ఒకే చెప్పింద‌ట‌…

కానీ సాయిపల్లవి గురించి తెలిసిన వారు మాత్రం ఈ వార్తలను నమ్మడం లేదు. ఎందుకంటే.. ఆమె ఓకే చెప్పాలంటే.. తన పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉండాలి. కానీ ఆ మధ్య వస్తున్న సినిమాలలో హీరోయిన్లకు పెద్దగా ప్రాముఖ్యం ఉండటం లేదు. సాయిపల్లవి ఎలాంటి చిత్రాలను పడితే అలాంటి చిత్రాలను ఒప్పుకునే రకం కాదు.

అదీ కాక పాత్ర కోసం అద్భుతమైన నటన కనబరుస్తుంది కాబట్టి.. టాలీవుడ్‌లో సెలెక్టివ్‌గా కథలను ఎంచుకుంటుంది. ఫిదా, విరాటపర్వం, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలలో సాయిపల్లవి న‌ట‌న‌కు ఫిదా అవ్వ‌ని వారు ఉండ‌రు. అయితే ఇప్పుడు సాయిపల్లవి ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఓకే చెప్పిందట. ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతుంది.

క‌థ కూడా విన‌కుండానే..

తన దగ్గరకు చాలా మంది దర్శకులు వచ్చి కథలు చెప్పినా.. అంగీకరించని సాయిపల్లవి.. తనకు ఎంతో ఇష్టమైన శేఖర్ కమ్ముల కోసం ఓ వెబ్ సిరీస్‌లో చేసేందుకు కథ కూడా వినకుండా ఓకే చెప్పిందట. అదీ మేటర్. ఇంతకు ముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా, లవ్ స్టోరీ చిత్రాల్లో ఆమె నటించింది.

లేడీ క్యారెక్టర్‌లను కొత్తగా చూపించడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ములది ప్రత్యేక శైలి. ఆయన హీరోయిన్లను చూపించే విధానం, ఆ క్యారెక్టర్‌లోని మలుపులు మెరుపులు సరికొత్తగా ఉంటాయి. సినిమాకే కాకుండా.. ఆ పాత్ర చేసిన వారికి కూడా పేరు తెచ్చిపెడతాయి. అందుకే శేఖర్ కమ్ముల కావడంతో.. ఆయనపై నమ్మకంతో సాయి పల్లవి ఈ సిరీస్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.