Samantha | ఇక సినిమాలు చేయ‌ను.. పెద్ద షాక్ ఇచ్చిన స‌మంత‌.. అస‌లు ఏమైంది..!

Samantha | ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన స‌మంత కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ వ‌చ్చింది. స‌మంత సినిమాలు మంచి విజ‌యం సాధించ‌డంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత పూర్తిగా త‌న దృష్టంతా సినిమాల‌పైనే పెట్టింది. గ‌త రెండేళ్లుగా వ‌రుస సినిమాలు చేస్తున్న నేప‌థ్యంలో అనారోగ్యానికి కూడా గురైంది . స‌మంత‌కు మ‌యోసైటిస్ వ్యాధి సోకింది అని తెలియ‌గానే ప్ర‌తి ఒక్క‌రు షాక్ […]

  • By: sn    latest    Jul 05, 2023 2:18 AM IST
Samantha | ఇక సినిమాలు చేయ‌ను.. పెద్ద షాక్ ఇచ్చిన స‌మంత‌.. అస‌లు ఏమైంది..!

Samantha |

ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన స‌మంత కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ వ‌చ్చింది. స‌మంత సినిమాలు మంచి విజ‌యం సాధించ‌డంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత పూర్తిగా త‌న దృష్టంతా సినిమాల‌పైనే పెట్టింది.

గ‌త రెండేళ్లుగా వ‌రుస సినిమాలు చేస్తున్న నేప‌థ్యంలో అనారోగ్యానికి కూడా గురైంది . స‌మంత‌కు మ‌యోసైటిస్ వ్యాధి సోకింది అని తెలియ‌గానే ప్ర‌తి ఒక్క‌రు షాక్ అయ్యారు. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఫ్యాన్స్ ప్రార్ధ‌న‌లు చేశారు. ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా ఆమె కోలుకోవాలంటూ పోస్ట్‌లు పెట్టారు.

స‌మంత ఇటీవ‌లి కాలంలో హిట్స్, ఫ్లాప్స్ అనే తేడా లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూ పోతుంది. ఇటీవ‌ల ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు చేయ‌గా, అందులో స‌మంత న‌టించిన‌ యశోద సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన శాకుతంలం చిత్రం మాత్రం ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద దారుణ‌మైన ప‌రాజ‌యాన్ని మూట‌ గ‌ట్టుకుంది.

ఇక ఇప్పుడు స‌మంత చేతిలో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా, సిటాడెల్ ఇండియన్ వెర్షన్, చెన్నై స్టోరీ చిత్రాలు ఉన్నాయి. వీటిని త్వ‌ర‌గా పూర్తి చేసి ఆ త‌ర్వాత ఏడాది పాటు సినిమాల‌కి దూరంగా ఉండాల‌ని స‌మంత భావిస్తుంద‌ట‌

మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత స‌మంత‌ ఖుషి, సిటాడెల్, చెన్నై స్టోరీ చిత్ర షూటంగ్స్ లో పాల్గొంటుంది. ఈ సినిమాల‌ని అంత‌క‌ముందే ఒప్పుకోవ‌డం వ‌ల‌న ఆరోగ్యం అంత బాలేకున్న కూడా పూర్తి చేస్తుంది. ఇప్ప‌టికే శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఖుషీ సినిమా షూటింగ్ పూర్తైంది.

ఇక సిటాడెల్ ప్రీక్వెల్ గా వస్తున్న వెబ్ సిరీస్ చిత్రీకరణ కూడా మ‌రి కొద్దిరోజుల‌లో షూటింగ్ పూర్తి చేసుకోనుందని సమాచారం. ప్ర‌స్తుతానికి అయితే తాను ఏ సినిమాలు ఒప్పుకోవ‌డం లేద‌ని, త‌న ఆరోగ్యం దృష్ట్యా స‌మంత ఏడాది పాటు సినిమాల‌కి చిన్న బ్రేక్ ఇవ్వాల‌ని అనుకుంటుంద‌ట‌. ఈ విష‌యం విని అభిమానులు షాక్ అవుతున్నారు. కాస్త ఆనందిచ్చ‌ద‌గ్గ విష‌యం ఏంటంటే స‌మంత తాను పూర్తి చేసిన సినిమాల ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటుంద‌ట‌.