Samantha | స‌మంత‌ని నమ్మించి మోసం చేసిన మేనేజ‌ర్.. విష‌యం తెలిసి షాక్

Samantha | సెల‌బ్రిటీల‌కి మేనేజ‌ర్స్ దిశా నిర్దేకులు అన్న విష‌యం తెలిసిందే. వారి కాల్షీట్స్ ద‌గ్గ‌ర నుండి రెమ్యున‌రేష‌న్స్ వ‌ర‌కు అన్ని కూడా వారే స్వ‌యంగా చూసుకుంటారు. హీరో, హీరోయిన్స్ కూడా వారిని చాలా న‌మ్ముతారు. అయితే ఇటీవల వారే మోసం చేస్తుండ‌డం హాట్ టాపిక్ అవుతుంది. ఆ మ‌ధ్య ర‌ష్మికని ఆమె మేనేజ‌ర్ మోసం చేసిన‌ట్టు తెగ ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఇప్పుడు స‌మంత మేనేజ‌ర్ ఆమె పేరు చెప్పి ఏకంగా కోటి రూపాయ‌లు నొక్కే […]

  • By: sn    latest    Sep 02, 2023 6:30 AM IST
Samantha | స‌మంత‌ని నమ్మించి మోసం చేసిన మేనేజ‌ర్.. విష‌యం తెలిసి షాక్

Samantha |

సెల‌బ్రిటీల‌కి మేనేజ‌ర్స్ దిశా నిర్దేకులు అన్న విష‌యం తెలిసిందే. వారి కాల్షీట్స్ ద‌గ్గ‌ర నుండి రెమ్యున‌రేష‌న్స్ వ‌ర‌కు అన్ని కూడా వారే స్వ‌యంగా చూసుకుంటారు. హీరో, హీరోయిన్స్ కూడా వారిని చాలా న‌మ్ముతారు. అయితే ఇటీవల వారే మోసం చేస్తుండ‌డం హాట్ టాపిక్ అవుతుంది. ఆ మ‌ధ్య ర‌ష్మికని ఆమె మేనేజ‌ర్ మోసం చేసిన‌ట్టు తెగ ప్ర‌చారం జ‌రిగింది.

ఇక ఇప్పుడు స‌మంత మేనేజ‌ర్ ఆమె పేరు చెప్పి ఏకంగా కోటి రూపాయ‌లు నొక్కే స్కెచ్ వేసిన‌ట్టు టాక్. మేట‌ర్‌లోకి వెళితే విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందిన ఖుషి చిత్రం నేడు విడుదల కాగా, ఈ మూవీలో స‌మంత క‌థానాయికగా న‌టించింది. చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శివ నిర్వాణ దర్శకత్వం వ‌హించారు.

ఈ సినిమా షూటింగ్ స‌మంత అనారోగ్యం వ‌ల‌న న‌త్తన‌డ‌క న‌డిచింది. మూడు నెల‌ల పాటు చిత్రీక‌ర‌ణ‌కి బ్రేక్ ప‌డింది. మ‌యోసైటిస్ వ‌ల‌న స‌మంత షూటింగ్‌లో పాల్గొన‌లేని స్థితిలో ఉన్నందున నిర్మాత‌లు షూటింగ్ ఆపేశారు.

అయితే మూడు నాలుగు నెలలు షూటింగ్‌ ఆపేయడం నిర్మాతలకు పెద్ద భారం కాగా, ఇది గ్ర‌హించిన స‌మంత తాను తీసుకునే పారితోషికంలో కోటి రూపాయలు తగ్గించాలని త‌న మేనేజ‌ర్‌కి చెప్పింద‌ట‌.

అయితే స‌మంత ఇప్పుడు అనారోగ్యంతో బాధ‌ ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ విష‌యం ప‌ట్టించు కోద‌ని భావించిన ఆమె మేనేజ‌ర్ నిర్మాతల నుండి పూర్తి పారితోషికం తీసుకోవాల‌ని అనుకున్నాడ‌ట‌. లిక్విడ్ రూపంలో అతను నిర్మాత‌ల‌ని అడిగాడ‌ట‌.

అయితే వారు కోటి రూపాయలు లిక్విడ్‌ ఇవ్వలేమని చెప్పగా, అతను తన ఫ్రెండ్స్ అకౌంట్స్ ఇచ్చే ప్రయత్నం చేయ‌డంతో నిర్మాత‌ల‌కి అనుమానం వ‌చ్చింది.

వెంట‌నే వారు స‌మంత‌ని సంప్ర‌దించ‌డంతో ఆమె అస‌లు విష‌యం తెలుసుకొని మేనేజర్‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధ‌మైంది. ఆంగ్ల పత్రికల్లో వచ్చిన ఈ వార్తలు ఇప్పుడు అటు ఫిల్మ్ నగర్‌లో, ఇటు సోషల్‌ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.