Sangeetha | పెళ్లి తర్వాత నరకం చూశా.. ఆ జీవితం వదిలేయానుకున్న
Sangeetha | పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు చెప్పగా, ఇప్పుడు మాత్రం పెళ్లంటే నూరేళ్ల మంటలా ఫీలవుతున్నారు. ఇప్పటి సమాజంలో పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. జీవితాంతం కలిసి ఉండాలనే ఓపిక చాలామంది భార్యాభర్తల్లో సన్నగిల్లడంతో చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు. అభిరుచులు కలవడం లేదని.. అభిప్రాయాలు కుదరడం లేదని మనస్పర్ధలు పెంచుకుంటూ విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవల నిహారిక పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అంత గొప్పగా పెళ్లి చేసుకొని పట్టుమని […]

Sangeetha | పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు చెప్పగా, ఇప్పుడు మాత్రం పెళ్లంటే నూరేళ్ల మంటలా ఫీలవుతున్నారు. ఇప్పటి సమాజంలో పెళ్లి మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. జీవితాంతం కలిసి ఉండాలనే ఓపిక చాలామంది భార్యాభర్తల్లో సన్నగిల్లడంతో చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారు.
అభిరుచులు కలవడం లేదని.. అభిప్రాయాలు కుదరడం లేదని మనస్పర్ధలు పెంచుకుంటూ విడాకులు తీసుకుంటున్నారు. ఇటీవల నిహారిక పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అంత గొప్పగా పెళ్లి చేసుకొని పట్టుమని పదేళ్లు సంసారం కూడా చేయలేక పోవడం చాలా దారుణం.
అయితే తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సంగీత పెళ్లి తర్వాత తను ఎదుర్కొన్న దుర్భర జీవితం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.సంగీత ఈ మధ్య ఆచార్య సినిమాలో లాహే లాహే పాటలో కనిపించి అలరించింది. అయితే తాజా ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ.. మొదట్లో మ్యారేజ్ లైఫ్‌ని అసహ్యించుకున్నట్టు, దాని నుంచి బయటకి రావాలని అనుకున్నట్టు తెలిపింది.
తమిళ నటుడు, సింగర్ క్రిష్‌ని 2009లో ప్రేమించి పెళ్లి చేసుకుంది సంగీత. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు దూరమయ్యారు. ఇక ఆ సమయంలో ఇరు కుటంబ సభ్యుల నుండి ఒత్తిడి, గొడవల వలన తాను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని సంగీత అనుకుందట.
మా ఇద్దరి రంగాలు వేరు, మనస్థత్వాలు భిన్నం, ఆలోచనలు, చేసే పనులు భిన్నంగా ఉండేవి, ఆయనకు నచ్చేది తనకు నచ్చదని, తనకు నచ్చేది ఆయనకు నచ్చదని, దీంతో ఇద్దరి మధ్య కొంత సంఘర్షణ జరిగేదని సంగీత పేర్కొంది. అయితే అప్పుడు మేము ఇద్దరం కూర్చొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం.
ఇద్దరం ఒకరినొకరం అర్ధం చేసుకున్నాం, కలిసి మాట్లాడుకున్నాం. ఓ పాయింట్ వద్ద ఇద్దరం కలిసి సమస్యని సాల్వ్ చేసుకోవాలను కున్నాం. ఆ దిశగా ప్రయత్నం చేయడంతో ఇద్దరం సంతోషంగా ఉన్నామని సంగీత తెలిపింది. సంగీత, క్రిష్‌లకి పదేళ్ల పాప ఉంది.