శంక‌రాభ‌ర‌ణంలోని శంకరా.. నాదశరీరాపరా.. పాట మ‌హాద్భుతం.. వీడియో

Sankarabharanam | సంగీతం, సాహిత్యం, క‌ళ‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తూ.. 1980లో శంక‌రాభ‌ర‌ణం చిత్రాన్ని కే విశ్వ‌నాథ్ తెర‌కెక్కించారు. ఈ చిత్రంతో విశ్వ‌నాథ్ క‌ళాత‌పస్విగా పేరు ప్ర‌ఖ్యాతులు గ‌డించారు. దేశ వ్యాప్తంగా శాస్త్రీయ సంగీత అభిమానుల ప్ర‌శంస‌లు కూడా పొందింది ఈ మూవీ. సినీ ప్ర‌పంచంలో ఒక సంచ‌ల‌నం సృష్టించిన శంక‌రాభ‌ర‌ణం చిత్రానికి కేవీ మ‌హాదేవ‌న్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని శంక‌రా.. నాద‌శ‌రీరా ప‌రా.. అనే పాట ఎంతో మంది మ‌న‌సుల‌ను దోచుకుంది. తెలుగు సినిమా […]

శంక‌రాభ‌ర‌ణంలోని శంకరా.. నాదశరీరాపరా.. పాట మ‌హాద్భుతం.. వీడియో

Sankarabharanam | సంగీతం, సాహిత్యం, క‌ళ‌ల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తూ.. 1980లో శంక‌రాభ‌ర‌ణం చిత్రాన్ని కే విశ్వ‌నాథ్ తెర‌కెక్కించారు. ఈ చిత్రంతో విశ్వ‌నాథ్ క‌ళాత‌పస్విగా పేరు ప్ర‌ఖ్యాతులు గ‌డించారు. దేశ వ్యాప్తంగా శాస్త్రీయ సంగీత అభిమానుల ప్ర‌శంస‌లు కూడా పొందింది ఈ మూవీ. సినీ ప్ర‌పంచంలో ఒక సంచ‌ల‌నం సృష్టించిన శంక‌రాభ‌ర‌ణం చిత్రానికి కేవీ మ‌హాదేవ‌న్ సంగీతం అందించారు.

ఈ చిత్రంలోని శంక‌రా.. నాద‌శ‌రీరా ప‌రా.. అనే పాట ఎంతో మంది మ‌న‌సుల‌ను దోచుకుంది. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఈ పాట‌కు ప్రాణం ఉంటుంది. ఈ పాట తెలుగు ఖ్యాతిని కూడా పెంచింది. ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినా ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ లో శంకరాభరణంది ఎప్పటికీ చెక్కుచెదరని స్థానం.

శంకరా నాదశరీరాపరా పాటను వేటూరి సుందర రామమూర్తి రాశారు. ఈ పాట‌కు రాష్ట్ర స్థాయిలో ఉత్త‌మ గీత ర‌చ‌యిత‌గా వేటూరికి నంది అవార్డు వ‌చ్చింది. ఈ పాట‌ను ఆల‌పించింది ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం.