విధాత, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రంలో సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అందులో సత్యదేవ్ ‘శంకరన్న’ పాత్రలో నటించాడు. ఆయన బిడ్డే రామ్ చరణ్. శంకరన్న చనిపోతూ.. ఆయన బిడ్డ సిద్ధని కాపాడే బాధ్యతలని చిరంజీవికి అప్పగిస్తాడు. ఆ సన్నివేశం తలచుకుంటే మాములుగా అయితే.. కళ్లలో నీళ్లు తిరగాలి. కానీ, పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వస్తుంది. ఎందుకంటే చిరంజీవి మేకోవర్ ఆ సన్నివేశంలో అలా ఉంటుంది మరి. ఇది ‘ఆచార్య’ […]
విధాత, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రంలో సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అందులో సత్యదేవ్ ‘శంకరన్న’ పాత్రలో నటించాడు. ఆయన బిడ్డే రామ్ చరణ్. శంకరన్న చనిపోతూ.. ఆయన బిడ్డ సిద్ధని కాపాడే బాధ్యతలని చిరంజీవికి అప్పగిస్తాడు. ఆ సన్నివేశం తలచుకుంటే మాములుగా అయితే.. కళ్లలో నీళ్లు తిరగాలి. కానీ, పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వస్తుంది.
ఎందుకంటే చిరంజీవి మేకోవర్ ఆ సన్నివేశంలో అలా ఉంటుంది మరి. ఇది ‘ఆచార్య’ ముచ్చట. ప్రజంట్ చిరంజీవి చేస్తున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ చిత్రానికి రీమేక్ ఇది. ఆ సినిమాలో మోహన్‌లాల్ సోదరిగా మంజు వారియర్ నటిస్తే.. ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా నయనతార నటిస్తోంది. ఇంత వరకు బాగానే ఉంది.
ఆ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ని మంజు వారియర్ రెండో పెళ్లి చేసుకుంటుంది. మొదటి భర్త చనిపోవడంతో ఆమె.. రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మొదటి భర్త చనిపోయే టైమ్‌కి మంజు వారియర్‌కి ఒక పాప కూడా ఉంటుంది. ఆ పాపతో వివేక్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక్కడకి వచ్చేసరికి.. నయనతారకి భర్తగా సత్యదేవ్ నటించినట్లుగా తాజాగా రివీల్ చేసిన ఫస్ట్ లుక్‌తో తెలిసిపోతుంది.
ఇందులో నయనతార.. సత్యప్రియ జైదేవ్‌గా నటిస్తున్నట్లుగా ఇటీవల ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇప్పుడు సత్యదేవ్ ‘జైదేవ్’ అంటూ అతని పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. నయనతారకు భర్తగా సత్యదేవ్ ఏంటనేదే? ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మాట్లాడుకుంటోన్న అంశం.
సత్యదేవ్ మంచి నటుడే కానీ.. అక్కడ వివేక్ ఒబెరాయ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అందులో నయనతార పక్కన సత్యదేవ్.. తమ్ముడిగా కనబడుతున్నాడు. ఆయన పాత్రలో పలు వేరియేషన్స్ ఉంటాయి. మెగాస్టార్‌ని ఢీ కొట్టాలి.. అలాగే సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ని కూడా ఆ పాత్ర ఢీ కొట్టాలి. అంతటి పవర్ ఫుల్ పాత్రకి ఈ యంగ్ హీరోని తీసుకున్నారేంటా? అని, ఆయన పాత్ర రివీలైన తర్వాత అంతా మాట్లాడుకుంటుండటం విశేషం.
ఈ పాత్ర రివీల్ చేయనంత వరకు.. చిరు, నయనతారలకు సోదరుడిగా ఆయన చేసి ఉంటాడని అనుకున్నారు.. నయనతార భర్త అని గాసిప్స్ అయితే వినిపించాయి కానీ.. కచ్చితంగా ఆయనే అని ఎవరూ నిర్థారణకు రాలేదు.. ఇప్పుడా విషయం మేకర్సే క్లారిటీ ఇచ్చారు. ఎలా చూసినా.. మరోసారి సత్యదేవ్ రూపంలో చిరు సినిమాకి ‘ఆచార్య’ గతే పట్టేట్టు ఉందని.. మెగాభిమానులు సైతం కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.