ఉపాధ్యాయుడి కాల్చివేత‌.. రిప‌బ్లిక్ డే రిహార్సల్

గణతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్‌కు హాజరై తన మోటార్‌సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఉపాధ్యాయుడిని గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు కాల్చి చంపారు

ఉపాధ్యాయుడి కాల్చివేత‌.. రిప‌బ్లిక్ డే రిహార్సల్
  • తర్వాత ఇంటికి వస్తుండ‌గా ఘ‌ట‌న‌
  • మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోరం

విధాత‌: గణతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్‌కు హాజరై తన మోటార్‌సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా 40 ఏండ్ల‌ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడిని గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు కాల్చి చంపారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో గురువారం సాయంత్రం ఈ దారుణ‌ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ వివ‌రాల ప్ర‌కారం..

ధార్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని బిద్వాల్ ప్రాంతంలో ఉన్న‌ కోడ్ ప్రాంతానికి చెందిన వీరేంద్ర సింగ్ అకా బిందు అనే ఉపాధ్యాయుడు ప్రైవేటు సంస్థ‌లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. గురువారం స్కూల్‌లో జ‌రిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్‌కు హాజర‌య్యారు.


సాయంత్రం తిరిగి త‌న దిచ‌క్ర‌వాహ‌నంపై ఇంటికి వ‌స్తుండ‌గా, గుర్తు తెలియని వ్యక్తులు అతి స‌మీపం నుంచి ఆయ‌న‌పై కాల్పులు జ‌రిపారు. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిపోయిన వీరేంద్ర‌సింగ్‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా, అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్టు వైద్యులు వెల్ల‌డించారు.

“వీరేంద్ర సింగ్ షేర్‌ఘర్‌లోని మానస్ అకాడమీలో బోధిస్తున్నాడు. కేసు నమోదు చేయబడింది. నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి” అని ఎస్పీ తెలిపారు.