ఉక్రెయిన్ మెడికో’ల‌కు సీట్లు ఇవ్వ‌లేం: తేల్చి చెప్పిన కేంద్రం

విధాత: ర‌ష్యాతో యుద్ధం కార‌ణంగా ఉక్రెయిన్‌లో అభ్య‌సిస్తున్న వైద్య విద్య‌ను మ‌ధ్య‌లోనే వ‌దిలేసి వ‌చ్చిన భార‌తీయ విద్యార్థుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గురువారం షాకిచ్చింది. ఉక్రెయిన్‌లో విద్య‌న‌భ్య‌సిస్తున్న భార‌తీయ విద్యార్థుల‌కు మ‌న దేశంలోని వైద్య క‌ళాశాల‌ల్లో సీట్ల‌ను స‌ర్దుబాటు చేయ‌లేమ‌ని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేర‌కు గురువారం కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ఓముఖ్య అంశాన్ని త‌న అఫిడ‌విట్‌లో ప్ర‌స్తావించింది. ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్య‌సిస్తున్న వారంతా […]

  • By: krs    latest    Sep 15, 2022 3:54 PM IST
ఉక్రెయిన్ మెడికో’ల‌కు సీట్లు ఇవ్వ‌లేం: తేల్చి చెప్పిన కేంద్రం

విధాత: ర‌ష్యాతో యుద్ధం కార‌ణంగా ఉక్రెయిన్‌లో అభ్య‌సిస్తున్న వైద్య విద్య‌ను మ‌ధ్య‌లోనే వ‌దిలేసి వ‌చ్చిన భార‌తీయ విద్యార్థుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గురువారం షాకిచ్చింది. ఉక్రెయిన్‌లో విద్య‌న‌భ్య‌సిస్తున్న భార‌తీయ విద్యార్థుల‌కు మ‌న దేశంలోని వైద్య క‌ళాశాల‌ల్లో సీట్ల‌ను స‌ర్దుబాటు చేయ‌లేమ‌ని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ మేర‌కు గురువారం కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది.

ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ఓముఖ్య అంశాన్ని త‌న అఫిడ‌విట్‌లో ప్ర‌స్తావించింది. ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్య‌సిస్తున్న వారంతా గతంలో భార‌త్‌లోని మెడిక‌ల్ కాలేజీల్లో సీట్లు సంపాదించేందుకు నీట్ ప‌రీక్ష‌ వ్రాశారని అందులో వారికి సీటు సాధించే స్థాయిలో ర్యాంకులు రాలేద‌ని తెలిపింది.

ఇక్క‌డ సీట్లు రాని కార‌ణంగానే వారంతా ఉక్రెయిన్‌లోని మెడిక‌ల్ కాలేజీల్లో చేరార‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ఇక్కడ కాలేజీల్లో సీటు సంపాదించ‌లేని విద్యార్థుల‌కు ఇప్పుడు ఉక్రెయిన్ ప‌రిస్థితుల‌ను కార‌ణంగా చూపి సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.