Secret Tracking Apps। మీ మొబైల్ ఫోన్‌లో గూఢచారి ఉన్నాడా?
మీ ఫోన్ ట్రాక్ అవుతుందనేందుకు సంకేతాలేంటి? వాటిని గుర్తించిన వెంటనే మీరు ఏం చేయాలి? మీ ఫోన్‌ను ఎవరైనా ట్రాక్ చేస్తున్నారనే (tracking your phone) అనుమానం మీకెప్పుడైనా కలిగిందా? చాలా మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు తమ లొకేషన్/లైవ్ లొకేషన్ షేర్ చేస్తుంటారు. అయితే.. కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు యాక్సెస్ పర్మిషన్లు ఇస్తే.. మీ ఫోన్‌ను ట్రాక్ చేసే (Secret Tracking Apps) ప్రమాదాలు ఉన్నాయంటండోయ్! విధాత : యాప్ స్టోర్స్ నుంచి […]

- మీ ఫోన్ ట్రాక్ అవుతుందనేందుకు సంకేతాలేంటి?
- వాటిని గుర్తించిన వెంటనే మీరు ఏం చేయాలి?
మీ ఫోన్‌ను ఎవరైనా ట్రాక్ చేస్తున్నారనే (tracking your phone) అనుమానం మీకెప్పుడైనా కలిగిందా? చాలా మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు తమ లొకేషన్/లైవ్ లొకేషన్ షేర్ చేస్తుంటారు. అయితే.. కొన్ని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు యాక్సెస్ పర్మిషన్లు ఇస్తే.. మీ ఫోన్‌ను ట్రాక్ చేసే (Secret Tracking Apps) ప్రమాదాలు ఉన్నాయంటండోయ్!
విధాత : యాప్ స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే కొన్ని యాప్‌లు రహస్యంగా మీ లొకేషన్‌ను ట్రాక్ చేయగలవు. మీ సంభాషణలు వినగలవు. అంతేకాదు.. మీ బ్యాంకు వివరాలు తెలుసుకుని, మీకు వచ్చిన మెసేజ్‌లు, ఇతర మీడియా ఫైల్స్‌ను వేరే డివైజ్‌కు పంపగలవు కూడా. బ్రిటన్‌కు చెందిన ఒక ప్రముఖ వెబ్‌సైట్.. మీ ఫోన్ ఎవరైనా ట్రాక్ చేస్తున్నారా? అనేది గుర్తించేందుకు కొన్ని చెక్ పాయింట్లు రూపొందించింది.
తెలియని యాప్స్ ఉన్నాయా?
మీ ఫోన్‌లో మీరు ఇంత వరకూ చూడని అప్లికేషన్స్ ఏమైనా కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. మీరు ఒకటి డౌన్‌లోడ్ చేయబోతే వేరే యాప్స్ ఏమైనా ఇన్‌స్టాల్ అయి ఉన్నాయేమో గమనించండి.
మీ ఫోన్ బ్యాటరీ వేగంగా డ్రెయిన్ అయిపోతున్నదా?
ఏదైనా అప్లికేషన్ అదే పనిగా నడుస్తూ ఉంటే.. మీ ఫోన్ బ్యాటరీ వేగంగా ఖాళీ అయిపోతుంది. మామూలు సందర్భాలకంటే త్వరగా బ్యాటరీ చార్జింగ్ ఖాళీ అయిపోతుంటే ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ ఏమున్నాయో గమనించండి. ఎందుకంటే ఏదైనా స్పైవేర్ అప్లికేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో అదేపనిగా రన్ అవుతూ ఉంటే మీ బ్యాటరీ త్వరగా ఖాళీ అయిపోతుంది.
మీ ఫోన్ వేడెక్కుతున్నదా?
అకస్మాత్తుగా మీ ఫోన్ వేడెక్కిందంటే అప్లికేషన్స్ బ్యాక్ గ్రౌండ్‌లో నిరవధికంగా రన్ అవుతున్నాయనేందుకు సంకేతం. మీరు ఫోన్ వాడక పోయినా వేడిగా ఉన్నదంటే ఎవరో మీ ఫోన్‌ను ట్రాక్ చేస్తున్నారని అనుమానించండి.
మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ వాడుతున్నారా?
అలాగైతే.. మీరు మీ ఫోన్‌ను ఉపయోగించడానికి ముందే దాని ఒరిజినల్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌ను రిస్టోర్ చేయండి. ఆ తర్వాతే లాగిన్ అవ్వండి.
మీ ఫోన్ ఎంత డాటాను ఉపయోగిస్తున్నది?
మీ ఫోన్‌లో స్పైవేర్ నడుస్తూ ఉన్నదంటే మీ ఫోన్ డాటా యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎవరో మీ ఫోన్‌లో మీ డాటాను గమనిస్తున్నారని, మీ డాటాను వేరే డివైజ్‌కు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానించాలి. మీ డాటా యూసేజ్ పేజీని గమనించాలి. అందులో ఏదైనా యాప్ అధిక మొత్తంలో డాటాను వాడుతున్నట్టయితే తెలిసిపోతుంది.
తరచూ ఫోన్ స్విచ్చాఫ్ అవుతున్నదా?
స్పైవేర్ యాప్స్ మీ ఫోన్‌ను తరచు స్విచ్చాఫ్ చేస్తుంటాయి. అంతేకాదు.. స్విచ్చాఫ్ అవడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో మీ ఫోన్‌ను సైబర్ క్రిమినల్స్ యాక్సెస్ చేయొచ్చు.
మొబైల్ ఆకస్మిక విపరీత ప్రవర్తనలు గమనించారా?
స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి నోటిఫికేషన్లు రాకపోయినా పింగ్ సౌండ్ రావడం, స్క్రీన్ ఆన్ కావడం వంటివి జరిగితే అనుమానించాల్సిందే.
మీ ప్రమేయం లేకుండా మెసేజ్‌లు వెళుతున్నాయా?
మీరు టైప్ చేయని మెసేజ్‌లు మీ సెంట్ బాక్స్‌లో కనిపిస్తున్నాయా? అలాగైతే మీ ఫోన్‌ను ఎవరో యాక్సెస్ చేసినట్టే. మీరు ఊహించని లేదా మీరు కోరుకోని మెసేజ్‌లు వచ్చినా అనుమానించాల్సిందే. కీలాగర్స్, స్పైవేర్‌లు ఇతరులు మీరు టైప్ చేయడాన్ని గమనించేందుకు వీలు కల్పిస్తాయి. మీరు టైప్ చేసేటప్పుడు ఆటోకరెక్షన్ సరిగ్గా పనిచేయడం లేదంటే ఏదో జరుగుతున్నట్టు లెక్క. స్క్రీన్‌షాట్ తీసినప్పుడు పూర్ క్వాలిటితో, పిక్సలేషన్‌తో ఫొటోలు ఉన్నాయంటే మీ ఫోన్ ట్రాక్ అవుతున్నట్టే.
ఎవరో మీ ఫోన్‌ను ట్రాక్ చేస్తున్నారని తెలిస్తే ఏం చేయాలి? మీ ఫోన్‌ను ఎలా క్లీన్ చేయాలి?
- సరైన యాంటివైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.
- మీ ఫోన్ స్టోరేజీని బ్యాకప్ తీసుకోండి. అప్పడు ఫ్యాక్టరీ రిసెట్ చేయండి.
- మీకు తెలియని యాప్స్ ఏమైనా ఉంటే అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
- యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో సదరు యాప్‌ను చట్టబద్ధంగానే తయారు చేశారా? అనేది గమనించండి.
- మీ ఫోన్‌లో ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ లేటెస్ట్ సిస్టమ్ అప్‌డేట్ చేసుకోండి.
- మీకు గుర్తులేని నెలవారీ సబ్‌స్క్రిప్షన్స్ ఉంటే తొలగించండి.
- నమ్మకమైన మ్యాప్ యాప్స్‌కు తప్ప.. ఇతర యాప్స్‌లలో లొకేషన్ ట్రాక్ చేసే పర్మిషన్ ఇవ్వకండి.
ఈ జాగ్రత్తలు కూడా పాటించండి..
మెయిల్‌లో వచ్చే లింకులను తెరిచేటప్పుడు లేదా ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేసేటప్పుడు వినియోగదారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. యాప్స్‌ను యాపిల్ లేదా గూగుల్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని, లింకుల ద్వారా వచ్చే యాప్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని చెబుతున్నారు. ఏయే అప్లికేషన్స్‌కు ఏమేం పర్మిషన్లు ఇచ్చామో అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం మరువొద్దని కోరుతున్నారు.