ఒకప్పుడు సెక్యూరిటీ గార్డ్.. ఇప్పుడు సబ్ ఇన్‌స్పెక్టర్
విధాత: వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడదు. అలాంటి నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువకుడు.. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు. చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. సబ్ ఇన్‌స్పెక్టర్ కొలువు సాధించి, అందరికీ ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాకు చెందిన పింటు రానా(25) డిగ్రీ వరకు చదివాడు. ఆ తర్వాత పోలీసు ఉద్యోగం సాధించాలనే తపన అతనిలో మొదలైంది. కానీ ఆర్థిక సమస్యలు […]

విధాత: వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడదు. అలాంటి నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువకుడు.. సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు. చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. సబ్ ఇన్‌స్పెక్టర్ కొలువు సాధించి, అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాకు చెందిన పింటు రానా(25) డిగ్రీ వరకు చదివాడు. ఆ తర్వాత పోలీసు ఉద్యోగం సాధించాలనే తపన అతనిలో మొదలైంది. కానీ ఆర్థిక సమస్యలు అతన్ని వెంటాడాయి. దీంతో సెక్యూరిటీ గార్డు జాబ్‌లో చేరాడు.
ఇక ఆ జీతం డబ్బులతో రానా పుస్తకాలు కొనుక్కొని, పోలీసు ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు. తన కష్టం వృధా కాలేదు. 33వ ర్యాంకు సాధించాడు. సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం వచ్చేసింది. 14 నెలల శిక్షణ అనంతరం ఇటీవలే రాజస్థాన్ పోలీసు బోర్డు పరేడ్ నిర్వహించింది. ఈ సందర్భంగా పింటు రానా తన తల్లిదండ్రులతో కలిసి సంతోషం పంచుకున్నాడు. రాజస్థాన్‌లోని జోద్‌పూర్ కమిషనరేట్‌లో పింటు రానాకు పోస్టింగ్ ఇచ్చారు.
