వామ్మో మళ్లో గిరి నాగు.. ఎలా పట్టారో చూడండి..?

విధాత: పాములు అనగానే శరీరంలో భయం పుడుతుంది. వెన్నులో వణుకు వచేస్తుంది. గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. మామూలు నాగుపాము ఐతేనే ఇంత భయపడుతాం. మరి ఈ గిరి నాగును చూస్తే ఖచ్చింతగా మీ గుండె జారుతుంది, వణికిపోతారంతే. మానసిక ఒత్తిడి.. పురుషాంగాన్ని కోసుకున్న వ్యక్తి దట్టమైన అడవుల్లో ఉండాల్సిన గిరినాగులు ఈ మధ్య జనావాసాల మధ్య ప్రత్యక్షమవుతున్నాయి. ఎక్కడో కేరళ అడవుల్లో సంచరించే ఈ గిరినాగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరుచూ దర్శనమిస్తున్నాయి. వారం రోజుల కిందట పశ్చిమ […]

  • By: krs    latest    Nov 25, 2022 8:30 AM IST
వామ్మో మళ్లో గిరి నాగు.. ఎలా పట్టారో చూడండి..?

విధాత: పాములు అనగానే శరీరంలో భయం పుడుతుంది. వెన్నులో వణుకు వచేస్తుంది. గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. మామూలు నాగుపాము ఐతేనే ఇంత భయపడుతాం. మరి ఈ గిరి నాగును చూస్తే ఖచ్చింతగా మీ గుండె జారుతుంది, వణికిపోతారంతే.

మానసిక ఒత్తిడి.. పురుషాంగాన్ని కోసుకున్న వ్యక్తి

దట్టమైన అడవుల్లో ఉండాల్సిన గిరినాగులు ఈ మధ్య జనావాసాల మధ్య ప్రత్యక్షమవుతున్నాయి. ఎక్కడో కేరళ అడవుల్లో సంచరించే ఈ గిరినాగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరుచూ దర్శనమిస్తున్నాయి. వారం రోజుల కిందట పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నపల్లి పామ్ ఆయిల్ తోటల్లో ఓ 20 అడుగుల గిరినాగు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే.

ఆ ఘటన మరవకముందే అనకాపల్లి జిల్లాలో మరో గిరినాగు దర్శనమిచ్చింది. అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం పాలగడ్డ గ్రామం వద్ద చీపురపల్లి జగ్గారావు అనే రైతు పొలంలో పది అడుగుల పైనే ఉన్న గిరినాగు కలకలం సృష్టించింది. పొలం పనుల నిమిత్తం అక్కడికి వెళ్లిన వారికి ఒక్కసారిగా ఈ పాము కనబడడంతో భయబ్రాంతులకు గురయ్యారు.

వెంటనే వారు స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేశ్‌కు సమాచారం ఇవ్వడంతో వెంకటేశ్‌ అక్కడికి వచ్చి పామును పట్టే ప్రయత్నం చేశారు. సుమారు పది అడుగుల పైన ఉండడంతో దాన్ని పట్టుకోవడానికి కాస్త కష్ట పడాల్సి వచ్చింది.

బుసలు కొడుతూ వారిని చాలా సేపు తిప్పలు పెట్టింది. చివరకు చాలా చాకచక్యంగా ఆ పామును పట్టి సమీపంలోని ఫారెస్ట్ రేంజ్ పరిధిలో వదిలి వేయగా అది శరవేగంగా ఆబవిలోకి వెళ్లి పోయింది. దీన్ని చూశాక మీరూ కూడా వామ్మో అని అనకుండా ఉండరు.