Warangal | గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సీతక్క
Warangal విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్ అపోలో ఆసుపత్రి యందు అనారోగ్యంతో చికిత్స పొందుతూ అకస్మాత్తుగా మరణించిన ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబాన్ని ఆదివారం ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గద్దర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించి, తన గళంతో అన్యాయాన్ని ప్రశ్నించి, పీడిత తాడిత ప్రజలకు అండగా నిలిచిన ప్రజా గాయకుడు గద్దర్ అని అన్నారు. వారి […]

Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్ అపోలో ఆసుపత్రి యందు అనారోగ్యంతో చికిత్స పొందుతూ అకస్మాత్తుగా మరణించిన ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబాన్ని ఆదివారం ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క పరామర్శించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గద్దర్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించి, తన గళంతో అన్యాయాన్ని ప్రశ్నించి, పీడిత తాడిత ప్రజలకు అండగా నిలిచిన ప్రజా గాయకుడు గద్దర్ అని అన్నారు.
వారి మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు.