ముంబైలో రూ.3.37 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) జుహు ప్రాంతంలో భారీగా డ్రగ్స్తోసహా విదేశీ పౌరుడిని అరెస్టు చేసింది

- డ్రగ్స్‌తో సహా విదేశీ పౌరుడి అరెస్టు
- సీజ్ చేసిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్
విధాత: ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) జుహు ప్రాంతంలో భారీగా డ్రగ్స్తోసహా విదేశీ పౌరుడిని అరెస్టు చేసింది. రూ.3.37 కోట్ల విలువైన మిథైల్ ఎడియోక్సీ మెథాంఫెటమైన్ (ఎండీఎంఏ) డ్రగ్స్‌ను కూడా ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక రాజధాని ముంబైలోని జుహు తారా రోడ్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ సమీపంలో విదేశీయుడిని అరెస్టు చేసినట్టు అధికారులు శుక్రవారం వెల్లడించారు.
విదేశీయుడు ఎగ్వే జాన్ అనే వ్యక్తిని రూ. 3.37 కోట్ల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్తోసహా అరెస్టు చేశారు. అతని సహచరుడు పరారీలో ఉన్నాడు. అరెస్టు సమయంలో అతని వద్ద రెండు కిలోల డ్రగ్ లభించింది. పొరుగున ఉన్న పాల్ఘర్లోని నాలాసోపరాలోని అతని సహచరుడి ఇంటి నుంచిమరో 250 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు ” అని జిల్లా ఏటీఎస్ అధికారి తెలిపారు.
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీ ఎస్) చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.