Costumes Krishna | టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

Costumes Krishna | టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకున్నది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని స్వగృహంలో కృష్ణ తుదిశ్వాస కన్నుమూశారు. ఆయన స్వస్థలం విశాఖపట్నం కాగా.. అసలు పేరు మాదాపు కృష్ణ. తెలుగులో అనేక సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. డ్రెస్ డిజైనింగ్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ ఆయనే సమకూర్చేవారు. సురేష్​ ప్రొడక్షన్స్​లో ఎన్నో సినిమాలకు పనిచేశారు. ఆయనను అందరూ ‘సురేష్’ కృష్ణ అని పిలిచేవారు. ఆ తర్వాత కాస్టూమ్స్ కృష్ణ […]

Costumes Krishna | టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

Costumes Krishna | టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకున్నది. ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని స్వగృహంలో కృష్ణ తుదిశ్వాస కన్నుమూశారు. ఆయన స్వస్థలం విశాఖపట్నం కాగా.. అసలు పేరు మాదాపు కృష్ణ. తెలుగులో అనేక సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. డ్రెస్ డిజైనింగ్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ ఆయనే సమకూర్చేవారు. సురేష్​ ప్రొడక్షన్స్​లో ఎన్నో సినిమాలకు పనిచేశారు. ఆయనను అందరూ ‘సురేష్’ కృష్ణ అని పిలిచేవారు. ఆ తర్వాత కాస్టూమ్స్ కృష్ణ అనే పేరు స్థిరపడింది. ‘భారత్​ బంద్​’తో ఆయన సినిమారంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాకు ఆయన అయిష్టంగానే ఓకే చెప్పారు.

కానీ, ఆ తర్వాత ఆయన చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. ‘పెళ్లాం చెబితే వినాలి’, ‘పోలీస్ లాకప్’, ‘అల్లరి మొగుడు’, ‘దేవుళ్లు’, ‘మా ఆయన బంగారం’, ‘విలన్’, ‘శాంభవి ఐపీఎస్’, ‘పుట్టింటికి రా చెల్లి’ తదితర చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. నిర్మాతగాను తన అభిరుచికి తగిన చిత్రాలు తీశారు. అయితే, ఎంత కష్టపడినా ప్రొడ్యూసర్​గా లాభాలు రాలేదని ఓ సందర్భంలో ఆయన పేర్కొన్నారు. జగపతి బాబు హీరోగా ‘పెళ్లి పందిరి’ సినిమాను కాస్ట్యూమ్స్ కృష్ణ నిర్మించారు. అంతకుమందు ‘అరుంధతి’, సూపర్ స్టార్ కృష్ణతో ‘అశ్వత్థామ’ మూవీని ఆయనే తెరకెక్కించారు. ఆయనకు నలుగురు సంతానం కాగా.. ఇద్దరు కూతుళ్లు, కొడుకులు ఉన్నారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.