Crime News | 16 ఏండ్ల బాలికపై 68 ఏండ్ల వృద్ధుడు అత్యాచారం.. వీడియో తీసిన 40 ఏండ్ల కుమారుడు
Crime News | ఓ 68 ఏండ్ల వృద్ధుడు పశువులా ప్రవర్తించాడు. 16 ఏండ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ ఘటనను వృద్ధుడి కుమారుడు(40) చిత్రీకరించాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో రెండు నెలల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నార్త్ ఢిల్లీలో 16 ఏండ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె ఇంటికి కొంచెం దూరంలో 68 ఏండ్ల వృద్ధుడు ఉంటున్నాడు. అయితే ఇరు కుటుంబాలు కలిసి యాత్రలకు […]

Crime News | ఓ 68 ఏండ్ల వృద్ధుడు పశువులా ప్రవర్తించాడు. 16 ఏండ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ఆ ఘటనను వృద్ధుడి కుమారుడు(40) చిత్రీకరించాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో రెండు నెలల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నార్త్ ఢిల్లీలో 16 ఏండ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె ఇంటికి కొంచెం దూరంలో 68 ఏండ్ల వృద్ధుడు ఉంటున్నాడు. అయితే ఇరు కుటుంబాలు కలిసి యాత్రలకు వెళ్లేవారు. దీంతో వృద్ధుడిని బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు నమ్మారు.
ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి 30వ తేదీ మధ్యలో బాలిక ఒంటరిగా ఉన్నది. ఈ సమయంలో ఆమెను మభ్యపెట్టి.. వృద్ధుడు తన గదిలోకి లాక్కెళ్లాడు. అక్కడ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బాలికను వృద్ధుడు బెదిరింపులకు గురి చేశాడు. దీంతో ఆమె తనకు జరిగిన అవమానాన్ని బయటకు చెప్పలేకపోయింది.
ఇలా వెలుగులోకి..?
అయితే బాలికపై అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలు బాధితురాలి తండ్రి మొబైల్‌కు వచ్చాయి. దీంతో ఏం జరిగిందని కూతుర్ని ప్రశ్నించాడు. జరిగిన విషయాన్ని కూతురు తండ్రికి చెప్పి బోరున విలపించింది. అనంతరం బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కుమారుడు వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందంటే..?
మరి వృద్ధుడి కుమారుడు ఆ ఘటనను ఎందుకు వీడియో తీయాల్సి వచ్చిందంటే.. తన తండ్రి చేతబడి చేస్తాడనే అనుమానం అతనికి ఉండేది. ఈ క్రమంలో కొన్ని నెలల కిందటే.. తండ్రి ఉండే గదిలో ఓ మొబైల్‌ను దాచి వీడియోలు చిత్రీకరిస్తున్నాడు.
ఆ క్రమంలోనే బాలికపై అత్యాచారం చేసిన ఘటన కూడా రికార్డు అయింది. అలా ఆ వీడియోలు వెలుగు చూశాయి. అయితే తండ్రీకుమారుడికి మధ్య విబేధాలు ఉన్నాయి. తండ్రిని ఎలాగైనా దొరికించుకోవాలన్న క్రమంలోనే కుమారుడు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.