Sensex | రికార్డు స్థాయికి సెన్సెక్స్‌.. ఇటీవలి చరిత్రలో ఇదే రికార్డు

Sensex ఇంట్రాడే ట్రేడ్‌లో 66వేల పైనే సూచీలు! ముంబై :స్టాక్‌ మార్కెట్ రికార్డు సృష్టించింది. గురువారం ఇంట్రా డే ట్రేడ్‌లో సూచీలు 66వేల గరిష్ఠస్థాయిని దాటిపోయాయి. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ వంటి దిగ్గజ కంపెనీలు మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఏర్పడేందుకు దోహదం చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 670.31 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి.. ఇంట్రాడేలో 66,064.21 పాయింట్లకు ఎగబాకింది. బారోమీటర్‌ 164.99 పాయింట్లు లేదా 0.25శాతం పెరిగి.. 65,558.89 పాయింట్ల వద్ద […]

  • By: Somu    latest    Jul 13, 2023 12:35 PM IST
Sensex | రికార్డు స్థాయికి సెన్సెక్స్‌.. ఇటీవలి చరిత్రలో ఇదే రికార్డు

Sensex

  • ఇంట్రాడే ట్రేడ్‌లో 66వేల పైనే సూచీలు!

ముంబై :స్టాక్‌ మార్కెట్ రికార్డు సృష్టించింది. గురువారం ఇంట్రా డే ట్రేడ్‌లో సూచీలు 66వేల గరిష్ఠస్థాయిని దాటిపోయాయి. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ వంటి దిగ్గజ కంపెనీలు మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఏర్పడేందుకు దోహదం చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 670.31 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి.. ఇంట్రాడేలో 66,064.21 పాయింట్లకు ఎగబాకింది.

బారోమీటర్‌ 164.99 పాయింట్లు లేదా 0.25శాతం పెరిగి.. 65,558.89 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌.. 29.45 పాయింట్లకు వెళ్లి.. 19,413.75 వద్ద ముగిసింది. ఒక దశలో 182.7 పాయింట్లు పెరిగి.. జీవితకాల గరిష్ఠం 19,567 పాయింట్లకు చేరింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సెర్వ్‌, టెక్‌ మహీంద్ర, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌ బాగా లాభపడినవాటిలో ఉన్నాయి. టీసీఎస్‌ షేర్‌ తన జూన్‌ త్రైమాసిక ఎర్నింగ్స్‌ ప్రకటించిన మరుసటి రోజే 2.47 శాతం పెరిగింది.

జూన్ త్రైమాసికానికి నెట్‌ ప్రాఫిట్‌ 16.83 శాతం పెరుగుదలతో 11,074 కోట్లకు చేరినట్టు బుధవారం ప్రకటించింది. పవర్‌గ్రిడ్‌, మారుతి, ఎన్టీపీసీ, రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌, హిందుస్థాన్‌ యునిలీవర్‌, నెస్ట్లే తదితర కంపెనీ షేర్లు వెనుకపట్టుపట్టాయి. వినియోగదారుల ధరల సూచీ ప్రకారం గత నాలుగు నెలలుగా తగ్గుతూ వచ్చిన ద్రవోల్బణం 4.81 శాతం పెరిగింది.