Sharmila | YSRTP విలీనం.. రేపు షర్మిల కీలక నిర్ణయం?

Sharmila విధాత: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు వైఎస్సార్ కుటుంబం అంతా రేపు శనివారం ఇడుపుల పాయకు చేరుకోనుంది. ఈ సందర్భంగా షర్మిల తన రాజకీయ భవిష్యత్ పై కీలక ప్రకటన చేయవచ్చని వైఎస్సార్ టిపీ వర్గాలు భావిస్తున్నాయి. కొంతకాలంగా వైఎస్సార్ టీపిని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న ప్రచారానికి షర్మిల స్పష్టతనిచ్చే అవకాశముంది. గతానికి భిన్నంగా ఈ దఫా వైఎస్సార్ జయంతి నివాళి కార్యక్రమంలో జగన్, షర్మిల […]

  • Publish Date - July 7, 2023 / 03:31 PM IST

Sharmila

విధాత: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు వైఎస్సార్ కుటుంబం అంతా రేపు శనివారం ఇడుపుల పాయకు చేరుకోనుంది. ఈ సందర్భంగా షర్మిల తన రాజకీయ భవిష్యత్ పై కీలక ప్రకటన చేయవచ్చని వైఎస్సార్ టిపీ వర్గాలు భావిస్తున్నాయి.

కొంతకాలంగా వైఎస్సార్ టీపిని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న ప్రచారానికి షర్మిల స్పష్టతనిచ్చే అవకాశముంది. గతానికి భిన్నంగా ఈ దఫా వైఎస్సార్ జయంతి నివాళి కార్యక్రమంలో జగన్, షర్మిల వేర్వేరుగా పాల్గొంటున్నారు.

ఇప్పటికే షర్మిల ఇడుపుల పాయకు చేరుకోగా ఆమె రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం ఉదయం తల్లి విజయలక్ష్మితో కలిసి తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించనున్నారు. మధ్యాహ్నాం వైఎస్ జగన్ ఇడుపులపాయకు రానున్నారు.