సీరియల్ నటి తునీషా ఆత్మహత్య కేసులో.. సహనటుడు షీజన్ ఖాన్ అరెస్ట్..!
Tunisha Sharma suicide case | సీరియల్ నటి తునీషా శర్మ శనివారం సాయంత్రం టీవీ షో సెట్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త అందరినీ దిగ్ర్భాంతికి గురి చేస్తుంది. పోలీసుల విచారణ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న కారణంతో సహ నటుడు షీజన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 306 కింద పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేయగా.. ఇవాళ కోర్టులో హాజరుపరుచనున్నారు. వివరాల్లోకి వెళితే.. […]

Tunisha Sharma suicide case | సీరియల్ నటి తునీషా శర్మ శనివారం సాయంత్రం టీవీ షో సెట్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త అందరినీ దిగ్ర్భాంతికి గురి చేస్తుంది. పోలీసుల విచారణ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న కారణంతో సహ నటుడు షీజన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 306 కింద పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేయగా.. ఇవాళ కోర్టులో హాజరుపరుచనున్నారు. వివరాల్లోకి వెళితే.. శనివారం టీవీ సెట్‌లోనూ తునీషా శర్మ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
సంఘటనా స్థలంలో పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే, ఆత్మహత్యకు కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. తునీషా మృతిపై హత్య, ఆత్మహత్య కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు. తునీషా భారత్ క వీర్‌పుత్ర మహారాణా ప్రతాప్ సీనియర్‌తో కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత చక్రవర్తి అశోక్ సామ్రాట్, షేర్ ఏ పంజాబ్, మహారాజా రంజిత్ సింగ్ తదితర సీరియల్స్‌లోనూ నటించింది. ప్రస్తుతం అలీబాబా సీరియల్‌లో కీలక పాత్ర పోషిస్తున్నది. ‘ఫితూర్’, ‘బార్ బార్ దేఖో’, ‘కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్ 3వంటి చిత్రాల్లోనూ నటించింది.