ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్‌

15 ఏళ్ల తర్వాత మేయర్‌ పీఠం బీజేపీ నుంచి చేజారింది 250 డివిజన్లకు గాను ఆప్‌ 135 చోట్ల జయకేతనం విధాత‌: ఢిల్లీ నగరపాలిక పీఠం ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కైవసం చేసుకున్నది. ఆప్‌ (AAP) మేయర్‌ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్‌ (Shelly Oberoi) ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి రేఖాగుప్తపై ఆమె 34 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీ మేయర్‌ ఎన్నిక జరిగింది. ఓటింగ్‌లో ఎంపీలు, కార్పొరేటర్లు […]

  • By: Somu    latest    Feb 22, 2023 10:40 AM IST
ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్‌
  • 15 ఏళ్ల తర్వాత మేయర్‌ పీఠం బీజేపీ నుంచి చేజారింది
  • 250 డివిజన్లకు గాను ఆప్‌ 135 చోట్ల జయకేతనం

విధాత‌: ఢిల్లీ నగరపాలిక పీఠం ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కైవసం చేసుకున్నది. ఆప్‌ (AAP) మేయర్‌ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్‌ (Shelly Oberoi) ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి రేఖాగుప్తపై ఆమె 34 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీ మేయర్‌ ఎన్నిక జరిగింది. ఓటింగ్‌లో ఎంపీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 250 డివిజన్లకు గాను ఆప్‌ 134 చోట్ల గెలుపొందిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ మేయర్‌ ఫీఠం బీజేపీ నుంచి చేజారింది.