ఏడవ రోజు ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ విచారణ

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు ఏడవ రోజు కస్టడి విచారణ ముగిసింది. శివ బాలకృష్ణ ఆస్తులు, బినామీ అకౌంట్లపై ఏసీబీ అధికారులు ఆరాతీశారు

ఏడవ రోజు ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ విచారణ

భారీగా అక్రమాల గుర్తింపు

విధాత : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు ఏడవ రోజు కస్టడి విచారణ ముగిసింది. శివ బాలకృష్ణ ఆస్తులు, బినామీ అకౌంట్లపై ఏసీబీ అధికారులు ఆరాతీశారు. ఇప్పటికే వందల ఎకరాల్లో భూములు, కిలోల కొద్దీ బంగారం, వెండి, పెద్ద మొత్తంలో నగదును అధికారులు గుర్తించారు. రేపటితో శివ బాలకృష్ణ 8 రోజుల రిమాండ్ పూర్తి కానుంది. 2021 నుంచి 2023 వరకూ హెచ్ఎండీఏలో శివ బాలకృష్ణ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఇచ్చిన అనుమతులపై ఏసీబీ కూపీ లాగింది.

రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులపై సైతం అధికారులు వివరాలు సేకరించారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో దొరికిన ఫైల్స్, డాక్యుమెంట్స్‌ని ఏసీబీ పరిశీలిస్తోంది. బినామీ ఆస్తులను గుర్తించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు వందకు పైగా ఫైల్స్ శివబాలకృష్ణ క్లియర్‌ చేసినట్లుగా ఏసబీ విచారణలో తేలింది. అతనితో పనిచేసిన హెచ్ఎండిఏ ఆఫీసులోని అధికారులను సైతం ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆధిత్య ఫినిక్స్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థల నుంచి శివబాలకృష్ణకు భారీగా ముడుపులు ముట్టాయని, ఇతర రియల్‌ ఎస్టేట్‌ సంస్థల నుంచి కూడా కోట్లు దండుకున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు.