రాజాసింగ్‌కు షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే..?
విధాత: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడుతున్నారంటూ మంగళహాట్ పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పలు కేసుల్లో బెయిల్ పై ఉన్న రాజాసింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఓ మతానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వివాదస్పద పోస్టు పెట్టారని మంగళహాట్ పోలీసులు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో నోటీస్ లపై సమాధానమివ్వాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. తనకు […]

విధాత: సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడుతున్నారంటూ మంగళహాట్ పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
పలు కేసుల్లో బెయిల్ పై ఉన్న రాజాసింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఓ మతానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వివాదస్పద పోస్టు పెట్టారని మంగళహాట్ పోలీసులు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
రెండు రోజుల్లో నోటీస్ లపై సమాధానమివ్వాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. తనకు వచ్చిన షోకాజ్ నోటీసులపై రాజాసింగ్ స్పందిస్తూ తాను ఫెస్ బుక్‌లో పెట్టిన చిన్న పోస్టుకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమని, అంటే తనపై సీఎం కేసీఆర్, పోలీసులు ఎంతగా దృష్టి పెట్టారో దీనిని బట్టి అర్ధమవుతుందన్నారు.