విధాత: సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెంలో మునగాల ఎస్సై ఆ గ్రామ MPTCపై చేయి చేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో కళాకారులు జై భీమ్ పాట పాడుతుండగా జై భీమ్ అంటే ఏమిటని కళాకారులను కాంగ్రెస్ ఎంపీటీసీ ఎర్నేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.
అక్కడే ఉన్న మునగాల ఎస్సై లోకేష్ శ్రీనివాస్ రెడ్డి సభను అడ్డుకుంటున్నాడని భావించి అతడిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకోన్నాయి. ఈ క్రమంలో MPTC శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సై లోకేష్ చేయి చేసుకున్నాడు. ఎస్ఐ దాడిలో శ్రీనివాస్ రెడ్డి కంటికి తీవ్ర గాయమైంది.
ఎస్సై దాడికి నిరసనగా శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. జరిగిన సంఘటనపై విచారించి ఎస్ఐపై చర్యలు తీసుకుంటానని సీఐ హామీ ఇవ్వడంతో శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు ఆందోళన విరమించారు.
అంబేద్కర్ జయంతిలో తనకు ప్రోటోకాల్ ప్రకారం వేదికపై స్థానం ఉన్నప్పటికీ పిలవలేదని, అయినప్ప టికీ నేను కార్యక్రమానికి సహకరించానని, ఎస్సై అకారణంగా తనపై దాడి చేయడాన్ని గ్రామస్తులు అంత చూశారని ఎస్సైపై చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్రీనివాస్ రెడ్డి కోరారు.
Suryapet: MPTCపై చేయి చేసుకున్న SI.. ఉద్రిక్తత https://t.co/nG6iHo1I6q #suryapet #telangana #brs #JaiBhim pic.twitter.com/onuwPThHcd
— vidhaathanews (@vidhaathanews) April 15, 2023
MPTCపై.. దాడి చేసిన SIపై చర్యలు తీసుకోవాలి.. నిరసనగా రేపు కోదాడలో దీక్ష : ఎంపీ ఉత్తమ్