SIIMA 2023 | బెస్ట్ హీరోగా ఎన్టీఆర్.. సైమాలో ఎవ‌రెవ‌రు స‌త్తా చాటారంటే..!

SIIMA 2023 | సౌత్ ఇండియాలో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా భావించే అవార్డుల వేడ‌కులో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) ఒకటి. ఈ అవార్డుల వేడుక‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన ప్ర‌ముఖులు పాల్గొంటారు. వారిలో బెస్ట్ టాలెంట్ ప్ర‌ద‌ర్శించిన వారికి అవార్డ్‌లు అందిస్తుంటారు. ఇప్ప‌టికే పది వసంతాలు పూర్తి చేసుకున్న సైమా.. తాజాగా 11వ ఎడిష‌న్ జ‌రుపుకుంది. ఈ వేడుక‌లో 'ఆర్ఆర్ఆర్' చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ సైమా​ అవార్డు అందుకున్నారు. […]

  • By: sn    latest    Sep 16, 2023 2:37 AM IST
SIIMA 2023 | బెస్ట్ హీరోగా ఎన్టీఆర్.. సైమాలో ఎవ‌రెవ‌రు స‌త్తా చాటారంటే..!

SIIMA 2023 |

సౌత్ ఇండియాలో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా భావించే అవార్డుల వేడ‌కులో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) ఒకటి. ఈ అవార్డుల వేడుక‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన ప్ర‌ముఖులు పాల్గొంటారు. వారిలో బెస్ట్ టాలెంట్ ప్ర‌ద‌ర్శించిన వారికి అవార్డ్‌లు అందిస్తుంటారు. ఇప్ప‌టికే పది వసంతాలు పూర్తి చేసుకున్న సైమా.. తాజాగా 11వ ఎడిష‌న్ జ‌రుపుకుంది.

ఈ వేడుక‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ సైమా​ అవార్డు అందుకున్నారు. అనంత‌రం ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కొమ‌రం భీం ప్రాత కోసం న‌న్ము న‌మ్మినందుకు జ‌క్కన్న‌కి థ్యాంక్స్. నా కో స్టార్, మై బ్ర‌ద‌ర్ రామ్ చ‌ర‌ణ్‌కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు.

నేను కింద ప‌డ్డ‌ప్పుడ‌ల్లా పైకి లేపిన నా అభిమానుల‌కి, నా కంట క‌న్నీళ్లు వాస్తే బాధ‌ప‌డినందుకు, నేను న‌వ్విన‌ప్పుడు వాళ్లు న‌వ్వి నాకు ఎల్ల‌ప్పుడు స‌పోర్ట్‌గా ఉన్న నా అభిమాన సోద‌రుల‌కి పాదాభివంద‌నం తెలియజేసుకుంటున్నాను అని తార‌క్ చాలా ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు.

2023 సంవ‌త్స‌రానికి సంబంధించిన ఈవెంట్ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 15వ తేదీన దుబాయ్‌లో దీన్ని అట్ట‌హాసంగా నిర్వహించారు. మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో తెలుగు, కన్నడ భాషలకు సంబంధించిన అవార్డులను అందించారు.

సైమా 2023 అవార్డుల్లో ఎక్కువ విభాగాల్లో నామినేషన్‌లో ఉన్న ట్రిపుల్ ఆర్ చిత్రం హ‌వా చాటింది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ గేయ రచయిత విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు దక్కాయి. ఈ చిత్రం తర్వాత ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చిన ‘సీతా రామం’ మూవీకి మూడు విభాగాల్లో అవార్డులు దక్కాయి.

ఇక సైమా విజేత‌ల పూర్తి వివ‌రాలు చూస్తే..

ఉత్తమ చిత్రం: సీతారామం
ఉత్తమ దర్శకుడు: ఎస్ఎస్ రాజమౌళి (RRR)
ఉత్తమ నటుడు: ఎన్టీఆర్ (RRR)
ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
ఉత్తమ విలన్: సుహాస్ (హిట్ 2)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్ చాయిస్): అడివి శేష్
ఉత్తమ నటి (క్రిటిక్స్ చాయిస్): మృణాల్ ఠాకూర్
ఉత్తమ సహాయ నటుడు: దగ్గుబాటి రానా (భీమ్లా నాయక్)
ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
ఉత్తమ హాస్యనటుడు: శ్రీనివాస్ రెడ్డి (కార్తికేయ 2)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎమ్ఎమ్ కీరవాణి (RRR)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (RRR)
ఉత్తమ గాయకుడు: రామ్ మిరియాల (డీజే టిల్లు)
ఉత్తమ గాయని: మంగ్లీ
ఉత్తమ నూతన హీరో: అశోక్ గల్లా (హీరో)
ఉత్తమ నూతన నటి : మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ నూతన దర్శకుడు: వశిష్ట (బింబిసార)
ఉత్తమ నూతన నిర్మాత: శరత్ అండ్ అనురాగ్ (మేజర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్ (RRR)
ఫ్యాషన్ యూత్ ఐకాన్: శృతి హాసన్
ప్రామిసింగ్ స్టార్: బెల్లంకొండ గణేష్
సెన్సేషనల్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్: కార్తికేయ 2