Silicon Valley Bank | సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ దివాళా..! భారత్‌పై ఎంత ఉంటుందా? నిపుణులు ఏంటున్నారంటే..?

Silicon Valley Bank | అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (SVB) దివాళా తీసింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అగ్రరాజ్యం చరిత్రలో పెద్ద ఆర్థిక సంక్షోభంగా నిలుస్తున్నది. 2008 మాద్యం సమయంలో వాషింగ్టన్‌ మ్యూచువల్‌ అండ్‌ లేమాన్‌ బ్రదర్స్‌ పతనం తర్వాత.. అదే అతిపెద్ద సంక్షోభంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బ్యాంక్‌ దివాళా తీసిన నేపత్యంలో భారత్‌లోనూ కలకలం సృష్టిస్తున్నది. భారత ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళలు వ్యక్తమవుతున్నాయి. […]

Silicon Valley Bank | సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ దివాళా..! భారత్‌పై ఎంత ఉంటుందా? నిపుణులు ఏంటున్నారంటే..?

Silicon Valley Bank | అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (SVB) దివాళా తీసింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అగ్రరాజ్యం చరిత్రలో పెద్ద ఆర్థిక సంక్షోభంగా నిలుస్తున్నది. 2008 మాద్యం సమయంలో వాషింగ్టన్‌ మ్యూచువల్‌ అండ్‌ లేమాన్‌ బ్రదర్స్‌ పతనం తర్వాత.. అదే అతిపెద్ద సంక్షోభంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ బ్యాంక్‌ దివాళా తీసిన నేపత్యంలో భారత్‌లోనూ కలకలం సృష్టిస్తున్నది. భారత ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాలను వెల్లడించారు.

ఎస్‌వీబీలో ఏం జరిగిందంటే..!

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ను మూసివేస్తున్నట్లు యూఎస్‌ రెగ్యులేటరీ శుక్రవారం ప్రకటించింది. కాలిఫోర్నియాలోని బ్యాంకింగ్ రెగ్యులేటర్లు బ్యాంకును మూసివేసిన తర్వాత ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC)ని బ్యాంక్ అసెట్ రిసీవర్‌గా నియమించారు. ఈ వార్త గ్లోబల్‌ మార్కెట్‌లో మాంద్యానికి సంకేకంగా నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి శాంటా క్లారా బేస్డ్‌ ఎస్‌వీబీ కష్టాలు మాతృసంస్థ ద్వారా మొదలయ్యాయి. ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌, దాని పోర్ట్‌ఫోలియో నుంచి 21 బిలియన్‌ డాలర్ల సెక్యూరిటీలను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది.

ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు 2.25 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. స్టార్టప్ పరిశ్రమలో విస్తృతమైన మందగమనం బ్యాంకులో అధిక డిపాజిట్ విత్‌డ్రాలకు దారితీసిందని, ఫలితంగా మూసివేత వైపు మళ్లినట్లుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత వడ్డీ ఆదాయం గణనీయంగా తగ్గుతుందని ఎస్‌వీబీ అంచనా వేసింది. మరో వైపు ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత ఎస్‌వీబీ లెక్కలు తారుమారయ్యాయి. దాంతో పెట్టబడిదారులు బ్యాంకు నుంచి ఏకకాలంలో నగదును ఉపసంహరించుకోవడం, బ్యాంకు దివాళా తీస్తుందనే భయంతో ఇన్వెస్టర్లు సైతం ఏకకాలంలో పెద్ద మొత్తంలో విక్రయించడంతో ఎస్‌వీబీ మూసివేతకు అతిపెద్ద కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.

తిరిగి రాని రాబడి..

ఎస్‌వీబీ 2021లో నికరంగా 189 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లను కలిగి ఉంది. బ్యాంకు గత రెండు సంవత్సరాల్లో ఈ సొత్తుతో బిలియన్‌ డాలర్ల విలువైన బాండ్‌లను కొనుగోలు చేసింది. అయితే, తక్కువ వడ్డీ రేట్ల కారణంగా భారీ పెట్టుబడిపై తగినంత రాబడిని పొందలేకపోయింది. మరో వైపు ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ టెక్‌ కంపెనీలకు వడ్డీ రేట్లను పెంచింది. దీంతో బ్యాంకు సంక్షోభం మరింత ముదిరింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) వారం క్రితం రెండు బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ మూలధనం సేకరించడంలో విఫలమైంది. ఈ క్రమంలో 2008 తర్వాత ఆర్థిక సంక్షోభంతో కుప్పకూలిన అతిపెద్ద బ్యాంక్‌గా నిలిచింది.

భారత్‌లో పెట్టుబడులు పెట్టిన ఎస్‌వీబీ..

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)లో ప్రస్తుత సంక్షోభం భారతీయ స్టార్టప్ ప్రపంచంపై ప్రభావాన్ని కాదనలేమని ఎస్‌వీబీ తెలిపింది. స్టార్టప్‌లపై డేటాను సమగ్రపరిచే ట్రాక్సన్ డేటా ప్రకారం.. ఎస్‌వీబీ భారతదేశంలో దాదాపు 21 స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టింది. అయితే, వాటిలో ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసిందన్న దానిపై స్పష్టత లేదు. భారతదేశంలో ఎస్‌వీబీ అత్యంత ముఖ్యమైన పెట్టుబడి సాస్‌ యూనికార్న్‌ అండ్‌ ఐసెర్టిస్‌ (SaaS-unicorn iSertis)లో ఉంది. స్టార్టప్ కంపెనీ గత ఏడాది అక్టోబర్‌లో ఎస్‌వీబీ నుంచి దాదాపు 150 మిలియన్ల నిధులను సేకరించింది. దీంతో పాటు బ్లూస్టోన్, పేటీఎం, వన్97 కమ్యూనికేషన్స్, పేటీఎం మాల్, నాప్టోల్, కార్వాలే, షాదీ, ఇన్‌మొబి, లాయల్టీ రివార్డ్జ్‌ సైతం నిధులను పొందాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థ ఎస్సెల్ పార్ట్‌నర్స్ కూడా ఎస్‌వీబీతో టై అప్‌లను కలిగి ఉన్నది.

భారత్‌పై ప్రభావం ఉంటుందన్న నిపుణులు

సిలికాన్‌ బ్యాంక్‌ మూసివేత నేపథ్యంలో భారతీయ స్టార్టప్‌ పరిశ్రమను షాకింగ్‌కు గురి చేసింది. ఈ బ్యాంక్‌ ఎన్నో స్టార్టప్‌ కంపెనీలకు బాసటగా నిలిచింది. బ్యాంక్‌ దివాళా నేపథ్యంలో భారతీయ స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. పరిశ్రమలో రాత్రికి రాత్రే ఒక్కసారిగా అనిశ్చితి నెలకొన్నది. అంతర్జాతీయ స్టార్టప్‌ల్లో పెట్టుబడులకు ప్రత్యేక సంస్థగా ఎస్‌వీబీ పేరొందింది. ఈ క్రమంలో ఢిల్లీ ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన అషుగార్గ్‌ స్పందిస్తూ.. కంపెనీ దివాళా భారతీయ స్టార్టప్‌లకు పెద్ద దెబ్బగా భావిస్తున్నానన్నారు. బ్యాంక్‌ భారతీయ స్టార్టప్‌ రంగానికి మద్దతుదారుగా నిలిచిందని, అమెరికాలో వ్యాపారం చేస్తున్న చాలా భారతీయ స్టార్టప్‌లో ఈ బ్యాంక్‌తో కలిసి పని చేస్తున్నాయన్నారు.

ఇదిలా ఉండగా.. సిలికాన్‌ వ్యాలీలో ప్రతి మూడో స్టార్టప్‌ ఇండో అమెరికన్లచే స్థాపించబడింది. రాబోయే రోజుల్లో కంపెనీలు తమ ఉద్యోగులకు బేసిక్‌ పేమెంట్స్‌, జీతాల చెల్లింపు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. యూఎస్‌లో ఉద్యోగి లేదా కార్యాలయం కూడా లేని భారతీయ స్టార్టప్‌లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి స్టార్టప్‌లు సిలికాన్ వ్యాలీ బ్యాంకులో తమ ఖాతాలను తెరిచాయి. ఎందుకంటే ఈ బ్యాంకు నియంత్రణ ప్రశ్నలు లేకుండా, కస్టమర్‌ స్నేహపూర్వక విధానంతో సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో స్టార్టప్‌ కంపెనీలు రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కొత్త స్టార్టప్‌లకు సులభంగా రుణాలు ఇచ్చేది. ఈ క్రమంలో స్టార్టప్‌ల విస్తరణ సైతం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.