Jawan | జ‌వాన్‌లో తెలుగు భామ‌.. షారూఖ్‌ సరసన న‌టించిన బిగ్ బాస్ బ్యూటీ

Jawan | బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మ‌ళ్లీ ఫాంలోకి వ‌చ్చాడు. ప‌ఠాన్ సినిమాతో మంచి హిట్ కొట్టిన షారూఖ్ ఇప్పుడు జ‌వాన్ అనే సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీగా రికార్డు క్రియేట్ చేసిన ఈ చిత్రం రికార్డులు తిర‌గ‌రాయడం ఖాయంగా క‌నిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో తెలుగు బ్యూటీ కూడా న‌టించ‌డంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్ష‌కులు కూడా […]

  • By: sn    latest    Sep 08, 2023 8:50 AM IST
Jawan | జ‌వాన్‌లో తెలుగు భామ‌.. షారూఖ్‌ సరసన న‌టించిన బిగ్ బాస్ బ్యూటీ

Jawan |

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మ‌ళ్లీ ఫాంలోకి వ‌చ్చాడు. ప‌ఠాన్ సినిమాతో మంచి హిట్ కొట్టిన షారూఖ్ ఇప్పుడు జ‌వాన్ అనే సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీగా రికార్డు క్రియేట్ చేసిన ఈ చిత్రం రికార్డులు తిర‌గ‌రాయడం ఖాయంగా క‌నిపిస్తుంది.

అయితే ఈ చిత్రంలో తెలుగు బ్యూటీ కూడా న‌టించ‌డంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఓ లుక్కేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 ఫేం, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించింది. ఇంత పెద్ద హిట్ అయిన ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి ఎవరూ లేరే అనే లోటుని సిరి తీర్చేసింది.

చిత్రంలో షారూఖ్ ప‌క్క‌న సిరి న‌టించిన‌ప్ప‌టికీ ఆమె పాత్ర‌కు డైలాగ్స్ లేవు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో షారుఖ్ నటించగా ఆయనకి సబ్ ఆర్డినేట్ పాత్రలో సిరి కనిపించి సంద‌డి చేసింది. షారుఖ్ పక్కన నటించడం అంటే మామూలు విషయం కాదు. కానీ సిరి ఆ గోల్డెన్ ఛాన్స్ అందుకొని ఫుల్ ఖుష్ అయింది.

షారూఖ్‌తో క‌లిసి నాలుగు సీన్స్‌లో సిరి న‌టించ‌గా, ఇప్పుడు ఆమె దృశ్యాలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు టాలీవుడ్ సినీ ప్రియులు. సిరి గ‌తంలో చాలా చిత్రాల‌లో న‌టించిన కూడా పెద్ద‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకోలేక‌పోయింది. ఇప్పుడు జ‌వాన్ చిత్రంతో ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్స్ క్యూ కట్ట‌డం ఖాయ‌మని అంటున్నారు.

ఇక జవాన్ విష‌యానికి వ‌స్తే ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి సూప‌ర్భ్ రెస్పాన్స్ వస్తోంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో .. దీపికా పదుకొనె కీలక పాత్రలో క‌నిపించి సంద‌డి చేసింది . పక్కా మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ నేప‌థ్యంలో అట్లీ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించాడు.

జవాన్ మూవీ తొలి రోజు కేవలం ఇండియాలోనే అన్ని భాషల్లో కలిపి రూ.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించి నట్లు స‌మ‌చారం.. కేవలం హిందీ వెర్షన్ లోనే రూ.65 కోట్లు వ‌సూళ్లు రాగా.. తమిళంలో రూ.5 కోట్లు, తెలుగులో మరో రూ.5 కోట్లు వసూలు చేసినట్లు ప్రముఖ వెబ్ సైట్ పేర్కొంది.