చెల్లి లవర్‌ను ముక్కలుగా నరికేశాడు.. కుక్కలకు ఆహారంగా పెట్టాడు..
Bihar | తన చెల్లి లవర్‌ను ఓ వ్యక్తి అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత అతని శరీర భాగాలను కుక్కలకు ఆహారంగా పెట్టాడు. ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నలంద జిల్లాకు చెందిన బిట్టు కుమార్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం ఆమె సోదరుడికి తెలిసింది. తన చెల్లిని ప్రేమించొద్దని బిట్టును ప్రియురాలి సోదరుడు రాహుల్ హెచ్చరించాడు. కానీ అతని మాటలను […]

Bihar | తన చెల్లి లవర్‌ను ఓ వ్యక్తి అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత అతని శరీర భాగాలను కుక్కలకు ఆహారంగా పెట్టాడు. ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నలంద జిల్లాకు చెందిన బిట్టు కుమార్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం ఆమె సోదరుడికి తెలిసింది. తన చెల్లిని ప్రేమించొద్దని బిట్టును ప్రియురాలి సోదరుడు రాహుల్ హెచ్చరించాడు. కానీ అతని మాటలను పట్టించుకోలేదు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన రాహుల్.. బిట్టును ఈ నెల 16న పిలిపించాడు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఇక బిట్టును రాహుల్ ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను కుక్కలకు ఆహారంగా పెట్టాడు. మిగతా వాటిని స్థానికంగా ఉన్న నదిలో పడేశాడు.
తమ కుమారుడు కనిపించడం లేదని 18వ తేదీన బిట్టు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా రాహుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. రాహుల్‌ను కోర్టులో ప్రవేశపెట్టి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.