DK Shiva Kumar | శివ కుమార్‌కు కేసుల గండం.. సీఎం పోస్టుకు అదే అడ్డంకి.!
DK Shiva Kumar | చివరకు సిద్ధరామయ్య కే పట్టం ?? విధాత: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది.. కాంగ్రెస్ అధ్యక్షుడు శివ కుమార్ (DK Shiva Kumar) ఒంటి చేత్తో పార్టీని లాగి విజయ తీరాలకు చేర్చారన్నది లోక విదితం..అయితే పండించిన వాడే తినాలని రూల్ లేదు.. వండే వాడికే భోజనం అనే నిబంధన లేదు . అంతా రెడీ చేశాక భోజనం ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి..ఆయోగం ఎవరికి ఉందో..చూడాలి. అయితే […]

DK Shiva Kumar |
- చివరకు సిద్ధరామయ్య కే పట్టం ??
విధాత: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది.. కాంగ్రెస్ అధ్యక్షుడు శివ కుమార్ (DK Shiva Kumar) ఒంటి చేత్తో పార్టీని లాగి విజయ తీరాలకు చేర్చారన్నది లోక విదితం..అయితే పండించిన వాడే తినాలని రూల్ లేదు.. వండే వాడికే భోజనం అనే నిబంధన లేదు . అంతా రెడీ చేశాక భోజనం ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి..ఆయోగం ఎవరికి ఉందో..చూడాలి.
అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు కాంగ్రెస్ సాధించడానికి శివకుమార్ చేసిన కష్టం అందరికీ తెలుసు . గతంలోని 78 సీట్లను 135కు చేర్చడానికి రాహుల్ పాదయాత్ర మొత్తం దక్షిణ భారత దేశంలో సాగడానికి శివకుమార్ చాలా శ్రమించారు. ఫలితం సాధించారు కానీ ఇప్పుడు ఆయన్ను సీఎం పీఠానికి దూరం చేసేందుకు అవకాశాలూ అన్నే ఉన్నాయి.
2013-18 మధ్య మంత్రిగా చేసిన శివ కుమార్ పోగేసిన అక్రమాస్తుల మీద కేసు నడుస్తోంది. ఆ కేసులను చూపించి భయపెట్టి లొంగ దీసుకుందాం అని అమిత్ షా వేసిన ఎత్తులు శివ కుమార్ ముందు పారలేదు..కేసులు ఎదుర్కొంటాను కానీ కాంగ్రెస్ కు లొంగేది లేదని భీషణ ప్రతిజ్ఞ చేసిన శివ కుమార్ అనుకున్నట్లే కాంగ్రెస్ ను గెలిపించారు.
ఇక ఇప్పుడు మిగిలింది కేసులు ఎదుర్కొనడం.. ఆ కేసులో విచారణకు ఈనెల 30న కోర్టుకు హాజరు కావాలని సీబీఐ ఆదేశించింది. ఇక నిన్నటి వరకూ కర్ణాటక డిజిపిగా ఉన్న ప్రవీణ్ సూద్ ను ఎకాఎకిన సీబీఐ చీఫ్ గా నియమించిన కేంద్రం ఇప్పుడు శివ కుమార్ ను కేసుల్లో వెంటాడే పని పెట్టుకుంది. ఈ కేసుల వ్యవహారం ఇప్పుడు శివ కుమార్ సీఎం కుర్చీ ఎక్కకుండా ప్రతిబంధకంగా మారింది. సరిగ్గా ఆ పాయింట్ చూపిస్తూ సిద్ధరామయ్య సీఎం పదవి కోసం పావులు కదుపుతున్నారు.
వాస్తవానికి కాంగ్రెస్ గెలుపు లో శివ కుమార్ పాత్ర ఎక్కువ అయినా సరే కేసులను బూచిగా చూపిస్తూ ఆయన్ను నిలువరించి, సిద్ధ కు సీఎం పీఠం కట్టబెట్టే యోచనలో కాంగ్రెస్ కనిపిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కూడిన బృందం బెంగళూరులో ఎమ్మేల్యేలు, నాయకులతో చర్చలు సాగిస్తోంది.. రెండు మూడు రోజుల్లో ఈ వ్యవహారం కొలిక్కి రావచ్చని అంటున్నారు.