IAS స్మితాసబర్వాల్‌ ఇంట్లోకి చొర‌బ‌డ్డ డిప్యూటీ త‌హ‌సీల్దార్‌

విధాత: ఐఏఎస్‌, సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ఇంట్లోకి మేడ్చల్‌ జిల్లాకు చెందిన డిప్యూటీ తహశీల్ధార్‌ అర్ధరాత్రి చొరబడి హల్‌చల్‌ చేశాడు. జూబ్లిహీల్స్‌లో స్మితాసబర్వాల్‌ ఉంటున్న గేటేడ్‌ కమ్యూనిటీ కాలనీలోని ఇంటికి కారులో తన మిత్రుడితో కలిసి వెళ్లిన డిప్యూటీ తహశీల్ధార్‌ ఆనంద్‌ను ముందుగా కాలనీ వాచ్‌మెన్‌ ఆపివేసి ఎవరని ప్రశ్నించాడు. తాను డిప్యూటీ తహశీల్ధార్‌నని మేడమ్‌ ఇంటికి వెళ్లాలని నమ్మకంగా చెప్పి సబర్వాల్‌ ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆనంద్‌ను సిబ్బంది అడ్డుకుని […]

  • By: krs    latest    Jan 22, 2023 6:44 AM IST
IAS స్మితాసబర్వాల్‌ ఇంట్లోకి చొర‌బ‌డ్డ డిప్యూటీ త‌హ‌సీల్దార్‌

విధాత: ఐఏఎస్‌, సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ఇంట్లోకి మేడ్చల్‌ జిల్లాకు చెందిన డిప్యూటీ తహశీల్ధార్‌ అర్ధరాత్రి చొరబడి హల్‌చల్‌ చేశాడు. జూబ్లిహీల్స్‌లో స్మితాసబర్వాల్‌ ఉంటున్న గేటేడ్‌ కమ్యూనిటీ కాలనీలోని ఇంటికి కారులో తన మిత్రుడితో కలిసి వెళ్లిన డిప్యూటీ తహశీల్ధార్‌ ఆనంద్‌ను ముందుగా కాలనీ వాచ్‌మెన్‌ ఆపివేసి ఎవరని ప్రశ్నించాడు.

తాను డిప్యూటీ తహశీల్ధార్‌నని మేడమ్‌ ఇంటికి వెళ్లాలని నమ్మకంగా చెప్పి సబర్వాల్‌ ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆనంద్‌ను సిబ్బంది అడ్డుకుని అతడిని గట్టిగా ఎవరని ప్రశ్నించగా, వారితో అతడు దురుసుగా వ్యవహరించాడు.

తాను మేడ్చల్‌ జిల్లా డిప్యూటీ తహశీల్ధార్‌నని, గతంలో మేడమ్‌తో ట్విట్టర్‌లో సంభాషించానని, తన పదోన్నతి పని కోసం వచ్చానంటూ చెప్పాడు. ఈ సంఘటనపై స్మితాసబర్వాల్‌ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు వ‌చ్చి ఆనంద్‌, అతడి స్నేహితుడు బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.