Shamshabad | షాంపూ, స‌ర్ఫ్‌లో దాచి బంగారం స్మ‌గ్లింగ్‌

Shamshabad | శంషాబాద్‌లో రూ.42.8 లక్షల విలువైన బంగారం స్వాధీనం విధాత‌: హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సోమ‌వారం రూ.42.8 లక్షల విలువైన అక్ర‌మ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షాంపూ, స‌ర్ఫ్‌లో దాచి బంగారం స్మ‌గ్లింగ్ చేస్తున్న ఇద్ద‌రిని అరెస్టు చేశారు. క‌స్ట‌మ్స్ అధికారుల వివ‌రాల ప్ర‌కారం.. కువైట్ నుంచి శంషాబాద్ విమానాశ్ర‌యానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల క‌ద‌లిక‌లు అనుమానాస్ప‌దంగా ఉండ‌టంతో అధికారులు వారి ల‌గేజీని క్షుణ్ణంగా సోదా చేశారు. ల‌గేజీ […]

  • By: krs    latest    Jul 31, 2023 9:13 AM IST
Shamshabad | షాంపూ, స‌ర్ఫ్‌లో దాచి బంగారం స్మ‌గ్లింగ్‌

Shamshabad |

శంషాబాద్‌లో రూ.42.8 లక్షల విలువైన బంగారం స్వాధీనం

విధాత‌: హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సోమ‌వారం రూ.42.8 లక్షల విలువైన అక్ర‌మ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షాంపూ, స‌ర్ఫ్‌లో దాచి బంగారం స్మ‌గ్లింగ్ చేస్తున్న ఇద్ద‌రిని అరెస్టు చేశారు.

క‌స్ట‌మ్స్ అధికారుల వివ‌రాల ప్ర‌కారం.. కువైట్ నుంచి శంషాబాద్ విమానాశ్ర‌యానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల క‌ద‌లిక‌లు అనుమానాస్ప‌దంగా ఉండ‌టంతో అధికారులు వారి ల‌గేజీని క్షుణ్ణంగా సోదా చేశారు.

ల‌గేజీ బ్యాగ్‌లో బియ్యం, వాషింగ్ పౌడర్, షాంపూ బాటిళ్లలో చిన్న‌చిన్న బంగారం ముక్క‌లు ల‌భించాయి. 704 గ్రాముల బంగారం దొరికింది. దాని విలువ మార్కెట్‌లో రూ.42.8 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు.

నిందితుల‌ను అదుపులోకి తీసుకొని కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. వస్తువుల మాటుల బంగారం స్మ‌గ్లింగ్ చేసిన తీరు కస్టమ్స్ అధికారులు వీడియో తీసి సోష‌ల్‌మీడియాలో పోస్టు చేశారు.