Snake Vs Dog | పాము నుంచి.. చిన్నారిని కాపాడేందుకు కుక్కల ప్రయత్నం కానీ.. చివరకు
Snake Vs Dog విధాత: ఒక చిన్నారిని కాపాడేందుకు కుక్కలు చేసిన విశ్వ ప్రయత్నం చూస్తే.. వాటి విశ్వసనీయత అర్థమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన జంతువుగా కుక్కలు పేరు సంపాదించుకున్నాయి. పెంపుడు కుక్కలు ఇంటి సభ్యుల్లా మెలుగుతూ ఉంటాయి. మన ఆజ్ఞలను పాటిస్తుంటాయి. మన మీద అలుగుతుంటాయి. కోప్పడుతుంటాయి. మనకేదైనా అపాయం జరుగుతుందని అర్థమైతే మనల్ని కాపాడేందుకు ముందుకు వస్తాయి. అందుకే ప్రాచీన కాలం నుంచీ కుక్కలు మనుషుల పాలిట విశ్వాసపాత్రులుగా నిలిచాయి. అయితే.. ఒక చిన్నారిని […]

Snake Vs Dog
విధాత: ఒక చిన్నారిని కాపాడేందుకు కుక్కలు చేసిన విశ్వ ప్రయత్నం చూస్తే.. వాటి విశ్వసనీయత అర్థమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన జంతువుగా కుక్కలు పేరు సంపాదించుకున్నాయి. పెంపుడు కుక్కలు ఇంటి సభ్యుల్లా మెలుగుతూ ఉంటాయి. మన ఆజ్ఞలను పాటిస్తుంటాయి.
మన మీద అలుగుతుంటాయి. కోప్పడుతుంటాయి. మనకేదైనా అపాయం జరుగుతుందని అర్థమైతే మనల్ని కాపాడేందుకు ముందుకు వస్తాయి. అందుకే ప్రాచీన కాలం నుంచీ కుక్కలు మనుషుల పాలిట విశ్వాసపాత్రులుగా నిలిచాయి.
అయితే.. ఒక చిన్నారిని కాపాడేందుకు కుక్కలు చేసిన ప్రయత్నం ఆఖరుకు తీవ్ర పర్యవసనాలు కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో ViralHog షేర్ చేయగా.. తెగ వైరల్ అయింది. ఇదే వీడియోను అవుటాఫ్ కాంటెక్ట్స్ హ్యూమన్ రేస్ అనే ట్విటర్ పేజీలో కూడా పోస్టయింది.
— Out of Context Human Race (@NoContextHumans) April 23, 2023
వీడియో విషయానికి వస్తే.. ఒక పాముతో మూడు కుక్కలు(Snake Vs Dog )పోరాడటం కనిపిస్తుంది. పక్కనే ఒకరు చిన్నారిని స్ట్రాలర్‌లో పెట్టుకుని ఆ దృశ్యాన్ని వీడియో తీస్తుంటారు. అయితే.. కొద్దిసేపు పాముతో పెనుగులాడిన ఒక కుక్క.. ఒక్కసారిగా దానిని నోట కరుచుకుని.. విసిరేస్తుంది. అంతే.. అది కాస్తా ఆ వీడియో తీస్తున్న వ్యక్తి మీద పడుతుంది.
దెబ్బతో ఆ వీడియో తీసే వ్యక్తి కిందికి మీదకై కెమెరాను పడిసినట్టు కనిపిస్తుంది. మరి ఆ పాము ఎక్కడకు పోయిందో కనిపించలేదు. దీనికి టాస్క్ ఫెయిల్డ్ సక్సెస్‌ఫుల్లీ అనే క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేశారు. దీనిని 30 లక్షల మంది చూశారు.
కొందరైతే కుక్కలు బాగానే తమ విధి నిర్వహించాయి కానీ.. పసికందుకు పక్కన పెట్టుకుని పాము ఉన్న చోట ఈ తలతిక్క వేషాలేంటి? అంటూ సదరు వీడియోను రికార్డ్ చేసినవారికి తిట్లతో తలంటిపోశారు. ‘ఇదేం పేరెంటింగ్? చాలా భయం వేసింది’ అని ఒక యూజర్ తీవ్రంగా మండిపడ్డారు.