స్నేహ, ప్రసన్న.. విడిపోవట్లేదు.. రూమర్స్‌కి బ్రేక్!
విధాత: హీరోయిన్‌గా చేసినంతకాలం తన నటనతో అందరినీ మెప్పించి, మరో సౌందర్యగా పేరు తెచ్చుకున్న నటి స్నేహ. ప్రసన్న అనే యాక్టర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత.. హీరోయిన్‌గా ఆమె సినిమాలు చేయలేదు. అయితేనేం.. కాస్త పెద్ద తరహా పాత్రలలో మాత్రం ఛాన్స్ వచ్చినప్పుడల్లా నటిస్తూనే ఉంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాలలో ఆమె నటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికీ, ఇప్పటికీ స్నేహలో అందం మాత్రం తరగలేదు. ఇప్పుడామె హీరోయిన్‌గా చేస్తానని చెప్పినా.. […]

విధాత: హీరోయిన్‌గా చేసినంతకాలం తన నటనతో అందరినీ మెప్పించి, మరో సౌందర్యగా పేరు తెచ్చుకున్న నటి స్నేహ. ప్రసన్న అనే యాక్టర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత.. హీరోయిన్‌గా ఆమె సినిమాలు చేయలేదు. అయితేనేం.. కాస్త పెద్ద తరహా పాత్రలలో మాత్రం ఛాన్స్ వచ్చినప్పుడల్లా నటిస్తూనే ఉంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాలలో ఆమె నటించిన విషయం తెలిసిందే.
అయితే అప్పటికీ, ఇప్పటికీ స్నేహలో అందం మాత్రం తరగలేదు. ఇప్పుడామె హీరోయిన్‌గా చేస్తానని చెప్పినా.. తీసుకునే వారున్నారు. కానీ అందుకు ఆమె సిద్ధంగా లేదు. ఇక విషయంలోకి వస్తే.. కొన్ని రోజులుగా స్నేహ, ప్రసన్నల వైవాహిక బంధంపై అనేక రకాలుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
స్నేహ, ప్రసన్నల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ప్రస్తుతం స్నేహ అతడిని వదిలేసి వేరుగా ఉంటుందనేలా టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్ కూడా కోడై కూసింది. దీంతో స్నేహని అభిమానించే వారంతా ఎంతగానో బాధపడుతున్నారు.
సెలబ్రిటీలందరి జీవితాలు ఇలా అవుతున్నాయేంటి అని కొందరు.. చైతూ, సమంతలతో పోలుస్తూ, స్నేహపై జాలి చూపించడం స్టార్ట్ చేశారు. అయితే వారిద్దరూ మాత్రం ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు స్పందించలేదు.
ఎందుకంటే, అసలు వాళ్లిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు కనుక. మీరు ఎన్ని రూమర్స్ చేసుకుంటారో చేసుకోండి.. మేము మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం అనేలా.. స్నేహ తన ఇన్‌స్టా స్టేటస్‌లో పెట్టిన ఫొటోతో అందరికీ క్లారిటీ ఇచ్చేసింది. తమపై వస్తున్న రూమర్స్‌కి బ్రేక్ వేసేసింది.
ఈ పిక్‌లో ‘వీకెండ్‌లో ఇద్దరం ఇలా’ అని చెబుతూ.. తన భర్తతో ఎంజాయ్ చేస్తున్న పిక్‌ని స్నేహ పోస్ట్ చేసింది. ఈ పిక్ చూసిన తర్వాత.. ఒక్క పిక్‌తో గాసిప్ రాయుళ్ల నోరు మూయించేసిందంటూ.. ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.