ఎవరో ఒకరు.. ఎప్పుడో గానీ టీఎన్ శేషన్ లాంటి వారు వస్తారు: సుప్రీం
విధాత: ఎన్నికల కమిషనర్ల నియామకాలపై విచారణ సదర్భంగా.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోట పదే పదే ఒక పేరు వినిపించింది. అదే టీఎన్ శేషన్. శేషన్ లాంటి వ్యక్తులు ఎవరో ఒకరు ఎప్పుడో గానీ వస్తారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ మధ్య అరుణ్‌గోయల్ అనే విశ్రాంత ఐఏఎస్ అధికారిని ఆదరాబాదరాగా కేంద్రం కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడంపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఒక్క రోజులోనే నియామక ప్రక్రియ పూర్తి చేసిన […]

విధాత: ఎన్నికల కమిషనర్ల నియామకాలపై విచారణ సదర్భంగా.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోట పదే పదే ఒక పేరు వినిపించింది. అదే టీఎన్ శేషన్. శేషన్ లాంటి వ్యక్తులు ఎవరో ఒకరు ఎప్పుడో గానీ వస్తారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించటం గమనార్హం.
ఈ మధ్య అరుణ్‌గోయల్ అనే విశ్రాంత ఐఏఎస్ అధికారిని ఆదరాబాదరాగా కేంద్రం కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడంపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఒక్క రోజులోనే నియామక ప్రక్రియ పూర్తి చేసిన విధానాన్ని తప్పుపటింది. ఆ క్రమంలోనే.. ఎన్నికల కమిషన్‌కు ప్రధానిని కూడా తప్పు పట్టే గట్స్ ఉండాలన్న అర్థంలో వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలోనే శేషన్ పేరు పలు మార్లు ప్రస్థావనకు వచ్చింది. టీఎన్ శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు దేశంలో ఇలాంటి ఒక అత్యున్నత అధికారాలు గల ఓ వ్యవస్థ, పదవి ఉంటుందని చాలా మందికి తెలియదు. శేషన్ 1990 డిసెంబర్ 12న ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పదవి చేపట్టి ఎన్నికల నిర్వహణలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
అమలులో ఉన్న ఎన్నికల కమిషన్‌లో 150పైగా లోపాలున్నాయని గుర్తించి సవరించారు. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల వ్యయాలపై కఠిన చట్టాలు తెచ్చారు. సీఈసీగా ఆరేండ్లు పదవిలో కొనసాగిన శేషన్ అధికారి అంటే, విధి నిర్వహణ అంటే ఇలా ఉండాలన్న రీతిలో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు, ఆదర్శంగా నిలిచారు.