తండ్రిని 32 ముక్క‌లుగా న‌రికి.. బోరుబావిలో వేసిన త‌న‌యుడు.. ఎందుకంటే..?

విధాత‌: ఓ తండ్రి మ‌ద్యానికి బానిస అయ్యాడు. భార్యాపిల్ల‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశాడు. నిత్యం గొడ‌వ‌లు పెట్టుకుంటూ కుటుంబ స‌భ్యుల‌ను హింసిస్తున్నాడు. భ‌ర్త వేధింపులు త‌ట్టుకోలేక భార్య త‌న పెద్ద‌కుమారుడితో క‌లిసి వేరుగా ఉంటుంది. మ‌రో ఇద్ద‌రు కుమారులు తండ్రి వ‌ద్దే ఉంటున్నారు. ఆ పిల్ల‌ల‌ను కూడా నిత్యం వేధిస్తుండ‌టంతో.. తండ్రి ఆగ‌డాల‌ను భ‌రించ‌లేని ఓ కుమారుడు అతి కిరాత‌కంగా న‌రికి చంపాడు. అనంత‌రం తండ్రి డెడ్‌బాడీని 32 ముక్క‌లుగా న‌రికి బోర్‌వెల్‌లో ప‌డేశాడు. క‌ర్ణాట‌క బాగ‌ల్‌కోట్ జిల్లాకు […]

తండ్రిని 32 ముక్క‌లుగా న‌రికి.. బోరుబావిలో వేసిన త‌న‌యుడు.. ఎందుకంటే..?

విధాత‌: ఓ తండ్రి మ‌ద్యానికి బానిస అయ్యాడు. భార్యాపిల్ల‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశాడు. నిత్యం గొడ‌వ‌లు పెట్టుకుంటూ కుటుంబ స‌భ్యుల‌ను హింసిస్తున్నాడు. భ‌ర్త వేధింపులు త‌ట్టుకోలేక భార్య త‌న పెద్ద‌కుమారుడితో క‌లిసి వేరుగా ఉంటుంది. మ‌రో ఇద్ద‌రు కుమారులు తండ్రి వ‌ద్దే ఉంటున్నారు. ఆ పిల్ల‌ల‌ను కూడా నిత్యం వేధిస్తుండ‌టంతో.. తండ్రి ఆగ‌డాల‌ను భ‌రించ‌లేని ఓ కుమారుడు అతి కిరాత‌కంగా న‌రికి చంపాడు. అనంత‌రం తండ్రి డెడ్‌బాడీని 32 ముక్క‌లుగా న‌రికి బోర్‌వెల్‌లో ప‌డేశాడు.

క‌ర్ణాట‌క బాగ‌ల్‌కోట్ జిల్లాకు చెందిన ప‌ర‌శురామ్‌(53)కు భార్య‌, ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. ప‌ర‌శురామ్ గ‌త కొన్నేండ్ల నుంచి ప్ర‌తి రోజు తాగుతున్నాడు. మ‌ద్యానికి బానిస అయిన ఆయ‌న భార్య‌ను, పిల్ల‌ల‌ను వేధిస్తున్నాడు. భ‌ర్త వేధింపులు త‌ట్టుకోలేని భార్య త‌న పెద్ద కుమారుడిని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయి, వేరే ప్రాంతంలో నివసిస్తోంది.

మ‌రో ఇద్ద‌రు పిల్ల‌లు ప‌ర‌శురామ్ వ‌ద్దే ఉంటున్నారు. అయితే డిసెంబ‌ర్ 6వ తేదీన రాత్రి పీక‌ల దాకా మ‌ద్యం సేవించి ఇంటికొచ్చిన ప‌ర‌శురామ్, కుమారుడు విఠ‌లను హింసించాడు. దీంతో తండ్రిని ఇనుప‌రాడ్‌తో కొట్టి చంపాడు విఠ‌ల‌. ఆ త‌ర్వాత డెడ్‌బాడీని 32 ముక్క‌లుగా న‌రికి, బోర్‌బావిలో ప‌డేశాడు.

ప‌ర‌శురామ్ మృతిపై క‌ర్ణాట‌క పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా విఠ‌ల‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. చేసిన నేరాన్ని అంగీక‌రించాడు. తండ్రిని చంపి, 32 ముక్క‌లుగా న‌రికి బోర్‌వెల్‌లో ప‌డేశాన‌ని తెలిపాడు. దీంతో అత‌న్ని పోలీసులు జైలుకు త‌ర‌లించారు.