భారత్ జోడో యాత్ర.. రాహుల్ చెయ్యి పట్టుకుని నడిచిన సోనియా
విధాత: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర ఇటీవలే కర్ణాటక రాష్ట్రానికి చేరుకుంది. ఈక్రమంలో విజయదశమి సందర్భంగా మంగళ, బుధవారాల్లో బ్రేక్ పడిన యాత్ర తిరిగి ప్రారంభమైంది. గురువారం ఉదయం 6.30 గంటలకు మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని బెల్లాలే గ్రామం నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. జక్కనహళ్లి క్రాస్ దగ్గర సోనియా గాంధీ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ […]

విధాత: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర ఇటీవలే కర్ణాటక రాష్ట్రానికి చేరుకుంది. ఈక్రమంలో విజయదశమి సందర్భంగా మంగళ, బుధవారాల్లో బ్రేక్ పడిన యాత్ర తిరిగి ప్రారంభమైంది.
గురువారం ఉదయం 6.30 గంటలకు మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని బెల్లాలే గ్రామం నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. జక్కనహళ్లి క్రాస్ దగ్గర సోనియా గాంధీ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ చెయ్యి పట్టుకుని కలిసి పాదయాత్ర చేశారు.
యాత్రలో పాల్గొనేందుకు సోనియాగాంధీ సోమవారమే కర్ణాటకకు చేరుకోగా రెండు రోజులు కొడుగు జిల్లాలోని ఓ రిసార్ట్‌లో బసచేశారు. వచ్చే సంవత్సరం కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌కు పాదయాత్ర కీలకంగా మారింది.
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీ.. చాలా కాలం తర్వాత పార్టీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోనియా యాత్రలో పాల్గున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మరింత రెట్టింపయిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.
రేపు భారత్ జోడో యాత్రలో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గోనున్నారు. సోనియా గాంధీతో పాటు స్థానిక మహిళా ఎమ్మెల్యేలు అంజలి నింబాల్కర్, రూపకళ, లక్ష్మీ హెబ్బాల్కర్ తదితరులు భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి అడుగులు వేశారు.
ఇవాళ ఉదయం సోనియాతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్,మాజీ సీఎం సిద్దరామయ్య కూడా పాల్గొన్నారు.
మార్చ్‌లో పాల్గొంటున్నందున నిరంకుశ, విభజన శక్తులపై మన(కాంగ్రెస్) పోరాటానికి మరింత బలం చేకూరింది అని పాదయాత్రలో సోనియా పాల్గొన్న వీడియోని కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. కాగా, బుధవారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకలోని భీమన్నకొల్లి ఆలయంలో దుర్గాదేవికి ప్రార్థనలు చేసి, దేశం సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.