South Central Railway | ప్రయాణికులకు అలెర్ట్.. ఈ నెల 9 వరకు 24 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..!
South Central Railway | దక్షిణ మధ్య రైల్వే వివిధ మార్గాల్లో నడిచే 24 రైళ్లను రద్దు చేసింది. సోమవారం (జూన్ 3) నుంచి.. ఈ నెల 9 వరకు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాజీపేట– డోర్నకల్, విజయవాడ – డోర్నకల్, భద్రాచలం– విజయవాడ, విజయవాడ– భద్రాచలం, సికింద్రాబాద్– వికారాబాద్, వికారాబాద్– కాచిగూడ, సికింద్రాబాద్– వరంగల్, వరంగల్– హైదరాబాద్, సిర్పూర్ టౌన్ – కరీంనగర్, కరీంనగర్ – నిజాబాబాద్ రైళ్లను రద్దు […]

South Central Railway | దక్షిణ మధ్య రైల్వే వివిధ మార్గాల్లో నడిచే 24 రైళ్లను రద్దు చేసింది. సోమవారం (జూన్ 3) నుంచి.. ఈ నెల 9 వరకు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాజీపేట– డోర్నకల్, విజయవాడ – డోర్నకల్, భద్రాచలం– విజయవాడ, విజయవాడ– భద్రాచలం, సికింద్రాబాద్– వికారాబాద్, వికారాబాద్– కాచిగూడ, సికింద్రాబాద్– వరంగల్, వరంగల్– హైదరాబాద్, సిర్పూర్ టౌన్ – కరీంనగర్, కరీంనగర్ – నిజాబాబాద్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. కాజీపేట– సిర్పూర్ టౌన్, బల్లార్షా– కాజీపేట, భద్రాచలం – బల్లార్షా, సిర్పూర్ టౌన్ – భద్రాచలం, కాజీపేట – బల్లార్షా, కాచిగూడ – నిజామాబాద్, నిజామాబాద్– నాందేడ్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ఇక కాచిగూడ – మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ ఉందానగర్ వరకు, నాందేడ్– నిజామాబాద్-పండర్పూర్ ఎక్స్ప్రెస్ను ముత్కేడ్ వరకు మాత్రమే నడుస్తుందని స్పష్టం చేసింది. అయితే, ఆయా డివిజన్ల పరిధిలో ట్రాక్ మెయింటెన్స్ పనులు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా రద్దు చేసినట్లు వివరించింది. ఈ మేరకు ప్రయాణికులు గమనించి.. సహకరించాలని కోరింది. దాంతో పాటు నేటి నుంచి 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. లింగంపల్లి – హైదరాబాద్, హైదరాబాద్ – లింగంపల్లి మధ్య నడిచే 10 రైళ్లు, లింగంపల్లి – ఉందానగర్ 3, లింగంపల్లి – ఫలక్ నుమా 2, ఉందానగర్ – లింగంపల్లి 4, ఫలక్ నుమా – లింగంపల్లి 2, రామచంద్రాపురం – ఫలక్ నుమా మధ్య నడిచే ఒక రైలును రద్దు చేస్తున్నట్లు చెప్పింది.