MMTS | ప్రయాణికులకు అలెర్ట్..! 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. ట్రైన్స్ వివరాలు ఇవే..!
MMTS | నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు వారం రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మెయింటనెన్స్ పనుల కారణంగా 22 రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు గమనించి.. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించింది. రద్దయిన రైళ్లలో లింగంపల్లి-హైదరాబాద్ మధ్య నడిచే రైళ్లు 12 ఉండగా.. మిగతావి లింగంపల్లి-ఉమ్దానగర్ రైళ్లు ఉన్నాయి. లింగంపల్లి-హైదరాబాద్ రైలు నంబర్ 47129, 47132, 47133, […]

MMTS | నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు వారం రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మెయింటనెన్స్ పనుల కారణంగా 22 రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు గమనించి.. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించింది. రద్దయిన రైళ్లలో లింగంపల్లి-హైదరాబాద్ మధ్య నడిచే రైళ్లు 12 ఉండగా.. మిగతావి లింగంపల్లి-ఉమ్దానగర్ రైళ్లు ఉన్నాయి.
లింగంపల్లి-హైదరాబాద్ రైలు నంబర్ 47129, 47132, 47133, 47135, 47136, 47137తో పాటు హైదరాబాద్ లింగంపల్లి 4711447105, 47108,47109, 47110, 47112 నంబరుగల ట్రైన్‌ను రద్దు చేసినట్లు పేర్కొంది. ఇక ఉమ్దానగర్ – లింగంపల్లి (47165), లింగంపల్లి-ఫలక్‌నుమా (47189), లింగంపల్లి-ఉమ్దానగర్ (47178,47181), లింగంపల్లి-ఫలక్‌నుమా(47179), ఫలక్‌నుమా-లింగంపల్లి(47158) ఎంఎంటీస్ ట్రైన్లు రద్దు అయ్యాయి. సికింద్రాబాద్, గుంటూరు డివిజన్లలో మెయింటనెన్స్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు పలు రైళ్ల స్టాప్స్‌ను కుదించింది.