Trains Cancelled | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. ఈ నెల 20 వరకు పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు..!
Trains Cancelled | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్లో భద్రతాపరమైన పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. అలాగే మరికొన్ని రైళ్లను పాక్షికం రద్దు చేయగా.. కొన్నింటిని దారి మళ్లించారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు కాకినాడ - విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్, విశాఖపట్నం - కాకినాడ ప్యాసింజర్ స్పెషల్, రాజమండ్రి - విశాఖపట్నం స్పెషల్ ప్యాసింజర్, విశాఖపట్నం - […]

Trains Cancelled | దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్లో భద్రతాపరమైన పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. అలాగే మరికొన్ని రైళ్లను పాక్షికం రద్దు చేయగా.. కొన్నింటిని దారి మళ్లించారు.
ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు కాకినాడ – విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్, విశాఖపట్నం – కాకినాడ ప్యాసింజర్ స్పెషల్, రాజమండ్రి – విశాఖపట్నం స్పెషల్ ప్యాసింజర్, విశాఖపట్నం – రాజమండ్రి స్పెషల్ ప్యాసింజర్, విశాఖపట్నం – విజయవాడ ఉదయ్ ఎక్స్ ప్రెస్, విజయవాడ – విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ప్రెస్ రద్దు చేసింది. 15 నుంచి 21 మధ్య విశాఖపట్నం – గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్, గుంటూరు – విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
అలాగే 14, 15 తేదీల్లో ఎర్నాకుళం – పాట్నా ఎక్స్ప్రెస్ను దారి మళ్లించింది. 16, 18 తేదీల్లో ఎస్వీఎం బెంగళూరు – గౌహతి ఎక్స్ప్రెస్, 13-20 తేదీల్లో కోయంబత్తూరు – సిల్చార్ ఎక్స్ప్రెస్ను దారి మళ్లించింది. విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మార్గంలో కాకుండా విజయవాడ, ఏలూరు, నిడదవోలు మార్గంలో నడవనున్నాయి.