మెగా గ్రామీణ క్రీడోత్సవాలు.. మంత్రి, ఎమ్మెల్యేలకు ఆహ్వానం

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ ఎఫ్.ఎస్.సి.ఏ క్లబ్ 40వ వార్షికోత్సవం సందర్భంగా మెగా గ్రామీణ క్రీడోత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈనెల 7నుంచి జిల్లా స్థాయి కబడ్డీ, వాలీబాల్, క్యారం, చెస్, డ్యాన్స్ పోటీల నిర్వహణకు క్లబ్ భారీ ఏర్పాట్లు చేసింది. గురువారం క్లబ్ సభ్యులు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని కలిసి టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అందుకు వారు సుముఖత వ్యక్తం చేసి క్రీడోత్సవాల ప్రారంభోత్సవానికి హాజరవుతామని […]

  • By: krs    latest    Jan 05, 2023 12:31 PM IST
మెగా గ్రామీణ క్రీడోత్సవాలు.. మంత్రి, ఎమ్మెల్యేలకు ఆహ్వానం

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ ఎఫ్.ఎస్.సి.ఏ క్లబ్ 40వ వార్షికోత్సవం సందర్భంగా మెగా గ్రామీణ క్రీడోత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈనెల 7నుంచి జిల్లా స్థాయి కబడ్డీ, వాలీబాల్, క్యారం, చెస్, డ్యాన్స్ పోటీల నిర్వహణకు క్లబ్ భారీ ఏర్పాట్లు చేసింది. గురువారం క్లబ్ సభ్యులు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని కలిసి టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అందుకు వారు సుముఖత వ్యక్తం చేసి క్రీడోత్సవాల ప్రారంభోత్సవానికి హాజరవుతామని తెలిపి, క్రీడల నిర్వహణకు అవసరమైన చేయూతను అందిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి క్రీడోత్సవాల నిర్వహణకు మూడు లక్షల సహాయాన్ని ప్రకటించారు.

ఎఫ్.ఎస్.సి.ఏ పునర్నిర్మాణంలో భాగంగా 40 వ వార్షికోత్సవం సందర్భంగా క్లబ్ పూర్వ ఘనతలను చాటుతూ… నేటి యువతరాన్ని క్లబ్ దిశగా ఆకర్షించేలా..క్లబ్ ప్రగతి ప్రస్థానాన్ని ముందుకు దూకించేలా వలిగొండలో మెగా గ్రామీణ క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నారు. క్రీడోత్సవాల ప్రారంభానికి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్లతో పాటు కలెక్టర్ పమేలా సత్పతిని, వివిధ శాఖల ఉన్నతాధికారులను, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. గతంలో ఎఫ్.ఎస్.సి.ఏ క్లబ్ పలు జిల్లా స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఈ దఫా మరింత భారీగా క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. క్లబ్ కు సంబంధించిన క్రీడాకారులు, క్రికెట్,వాలీబాల్ క్యారం, చెస్ జట్లు జిల్లా, రాష్ట్ర స్థాయిలలో రాణించి అనేక విజయాలు సాధించారు.

ఎఫ్.ఎస్.సి.ఏ ఆణిముత్యం క్రికెటర్ రాంబాబు

గతంలో ఎఫ్.ఎస్.సి.ఏ క్లబ్ తరఫున గొప్పగా రాణించిన క్రీడాకారులలో ముఖ్యంగా ఎఫ్.ఎస్.సి.ఏ క్లబ్ నిర్వహణలో కీలక భూమిక పోషించి తన క్రికెట్ ఆట ద్వారా క్లబ్ కు రాష్ట్ర స్థాయిలో వన్నెతెచ్చిన సీలోజు రాంబాబు క్రీడాభిమానుల యాదిలో మెదులుతారు. రాంబాబు క్రికెట్లో తన ఆల్ రౌండ్ నైపుణ్యంతో ఎఫ్.ఎస్.సి.ఏ క్లబ్ కు ఎన్నో గొప్ప విజయాలు అందించి యువకులెందరినో క్రీడల పట్ల, క్లబ్ పట్ల ఆకర్షితులయ్యేలా ప్రభావితం చేశారు.

1985 నుంచి 2000 సంవత్సరం వరకు దాదాపుగా 400 మ్యాచ్ లు ఆడిన రాంబాబు ప్రతిభావంతుడైన క్రికెటర్ గానే కాకుండా ” వలిగొండ-ఎఫ్.ఎస్.సి.ఏ ” క్లబ్ అంటే రాంబాబు, రాంబాబు అంటేనే “వలిగొండ- ఎఫ్.ఎస్.సి.ఏ క్లబ్ అనే తీరుగా పేరు ప్రఖ్యాతినొంది సొంత ఊరుకు, క్లబ్ కు గుర్తింపు తెచ్చిన క్రీడాకారుడిగా నిలిచారు. తన క్రికెట్ కెరీర్ లో రాష్ట్రస్థాయి అండర్- 19 క్రికెట్ జట్టులో చోటు సాధించి, 1991లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఇంగ్లాండ్ పై క్రికెట్ ఆడిన గొప్ప క్రీడాకారుడిగా రాంబాబు ఈ క్లబ్ కు, ఊరికి గర్వకారణంగా నిలిచారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఆడటం ద్వారా రాంబాబు ఎఫ్.ఎస్.సి.ఏ క్లబ్ క్రీడా పటిమను కీర్తి పతాకను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడం చిరస్మరణీయం. ఎఫ్.ఎస్.సి.ఏ 40 వసంతాల పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న మెగా టోర్నమెంట్ వేడుకల వేళ.. గతంలో క్లబ్ ఘనతను రాష్ట్ర స్థాయిలో చాటిన రాంబాబును, వివిధ క్రీడల్లో రాణించిన సభ్యులను, క్లబ్ 40 ఏళ్ల ప్రస్థానంలో కీలక భూమిక పోషించిన సీనియర్లను ఘనంగా సన్మానించుకోవడం ద్వారా వర్ధమాన క్రీడాకారులకు, యువతరానికి స్ఫూర్తినివ్వాల్సివుంది.