Sreeleela | వ‌జ్రంలా ద‌గ‌ద‌గ మెరిసిపోతున్న శ్రీలీల‌.. చిత్తైపోతున్న ఫ్యాన్స్

Sreeleela | పెళ్లి సంద‌డి చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన  అందాల ముద్దుగుమ్మ శ్రీలీల‌. టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ సెన్సేష‌న్‌గా మారింది.  భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన ఈ అందాల భామ‌ పేరు తెగ‌ మారుమోగుతోంది. శ్రీలీల ధ‌మాకా చిత్రంతో కెరీర్‌లో పెద్ద‌హిట్ కొట్టి ఆ త‌ర్వాత స్టార్ హీరోల సినిమా అవ‌కాశాల‌ని అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఈ భామ చేతిలో  ఏడేనిమిది భారీ ప్రాజెక్ట్స్ ఉండటం విశేషం. ప్రస్తుతం ఒక్కొక్కటి విడుదలకూ సిద్ధం […]

  • By: sn    latest    Aug 31, 2023 9:04 AM IST
Sreeleela | వ‌జ్రంలా ద‌గ‌ద‌గ మెరిసిపోతున్న శ్రీలీల‌.. చిత్తైపోతున్న ఫ్యాన్స్

Sreeleela |

పెళ్లి సంద‌డి చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ శ్రీలీల‌. టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ సెన్సేష‌న్‌గా మారింది. భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన ఈ అందాల భామ‌ పేరు తెగ‌ మారుమోగుతోంది. శ్రీలీల ధ‌మాకా చిత్రంతో కెరీర్‌లో పెద్ద‌హిట్ కొట్టి ఆ త‌ర్వాత స్టార్ హీరోల సినిమా అవ‌కాశాల‌ని అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఈ భామ చేతిలో ఏడేనిమిది భారీ ప్రాజెక్ట్స్ ఉండటం విశేషం.

ప్రస్తుతం ఒక్కొక్కటి విడుదలకూ సిద్ధం అవుతుండ‌గా, ఇందులో ఎన్ని చిత్రాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తాయి అనేది కూడి ఆస‌క్తిగా మారింది. వచ్చే నెలలో ఉస్తాద్ రామ్ పోతినేని – శ్రీలీలా జంటగా నటించిన చిత్రం రిలీజ్ కానుండ‌గా, ఈ చిత్రానికి బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పాన్ ఇండియా మూవీగా చిత్రం రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 15న మూవీ రిలీజ్ కానుంది.

ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీలీల ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ రాయల్ వైట్ ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంది. ఈ డ్రెస‌స్ లో ఫుట్ షూట్ చేసి అంద‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

కుర్ర హీరోయిన్ ఫోజులకు ఫ్యాన్స్ తో నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. డాన్స్, నటనతోనే కాకుండా శ్రీలీలా అందం విషయంలోనూ కుర్ర‌కారు మ‌నసుని ఎంతగానొ దోచుకుంటుంది. ఆకర్షించే ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేస్తున్న శ్రీలీల త‌న ఫాలోయింగ్ అంతకంతకు పెంచుకుంటూ పోతుంది.

ప్ర‌స్తుతం శ్రీలీల పిక్స్ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఇక శ్రీలీల ప్ర‌స్తుతం అర‌డ‌జ‌ను సినిమాల‌తో బిజీగా ఉండ‌గా, ఇందులో తెలుగులోనే ‘ఆదికేశవ’, ‘స్కంద’, ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘భగవంత్ కేసరి’, VD12, అనగనగ ఒక రాజు, ఎక్ట్రార్డినరీ మ్యాన్ వంటి చిత్రాలు త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇవి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో రంజింప‌జేసే విధంగా ఉంటాయ‌ని తెలుస్తుంది.